Tegimpu Review : కథ వేరైనా కథనం మనీహైస్ట్ సిరీస్.. క్రిమినల్ మంచి పని చేస్తే.. అజిత్ వన్ మ్యాన్ షో..

అజిత్ హీరోగా, మంజు వారియర్ మరో మెయిన్ లీడ్ లో బోణి కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తునివు. ఈ సినిమాని తెలుగులో తెగింపు పేరుతో జనవరి 11న విడుదల చేశారు..........

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 02:14 PM

Tegimpu Review : కథ వేరైనా కథనం మనీహైస్ట్ సిరీస్.. క్రిమినల్ మంచి పని చేస్తే.. అజిత్ వన్ మ్యాన్ షో..

Tegimpu Review :  అజిత్ హీరోగా, మంజు వారియర్ మరో మెయిన్ లీడ్ లో బోణి కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తునివు. ఈ సినిమాని తెలుగులో తెగింపు పేరుతో జనవరి 11న విడుదల చేశారు. అజిత్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా చాలా వరకు అజిత్ సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి.

కథ విషయానికి వస్తే ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ (అజిత్) తో ఓ బ్యాంక్ చైర్మన్ డీల్ క్యాన్సిల్ అవ్వడంతో అతన్ని చంపాలనుకొని దాడి చేయిస్తాడు బ్యాంక్ చైర్మన్. వాళ్ళ మనుషులు చనిపోయి, అజిత్, మంజు వారియర్ ప్రాణాలతో బయటపడతారు. దీంతో ఆ బ్యాంక్ చైర్మన్ మీద పగ తీర్చుకోవాలి అనుకునే సమయంలో అతను చేసిన మోసాలు తెలియడంతో ఈ పనిని అడ్డు పెట్టుకొని అతని పగ తీర్చొచ్చు అని ఫిక్స్ అయి ఓ మంచిపనిని కూడా చేస్తాడు. ఇందుకోసం బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ ని ఎంచుకుంటాడు. కథ పరంగా చూస్తే చాలా చిన్న కథే, ఎలాంటి ట్విస్ట్ లు కూడా లేవు. మధ్యలో ఓ ట్విస్ట్ ఉన్నా అది పెద్దగా అనిపించదు.

సినిమా మొత్తంలో దాదాపు 80 శాతం బ్యాంక్ లోనే షూటింగ్ జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో బాగా హిట్ అయిన మనీహైస్ట్ సిరీస్ చూసిన వాళ్లకి ఈ కథనం అంతగా అనిపించదు. హీరో బ్యాంక్ లో కూర్చొని తన పని అయ్యేదాకా బయట పోలీసులతో ఆడుకుంటాడు. బయట నుంచి ఒకరు హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకేచోట కథ మొత్తం ఉండటంతో కొన్ని సార్లు సాగదీసినట్టు ఉంటుంది. ఇక అజిత్ గత సినిమాల లాగే తుపాకులు, బాంబ్స్, డాన్స్.. ఇలా కాసేపు యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, లవ్ సీన్స్ ఏమి ఉండవు. సినిమా సీరియస్ గా సాగిపోతూ మధ్యలో డైలాగ్స్, మాటలతోనే కామెడీని రప్పించే ప్రయత్నం చేశారు. ఒక చిన్న పాయింట్ ని తీసుకొని బ్యాంక్ లో కథనం రాసుకున్నాడు దర్శకుడు. అయితే చివర బ్యాంక్స్ చేసే మోసాల గురించి మాత్రం ఓ మెసేజ్ ఇస్తాడు.

Veerasimha Reddy Review : యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సెంటిమెంట్‌ని పండించిన వీరసింహారెడ్డి.. స్క్రీన్‌పై బాలయ్య ఊచకోత..

టెక్నికల్ గా సినిమా టేకింగ్ బాగుంటుంది. కథ, కథనం రెండూ అంతగా ఆకట్టుకోవు. ఫ్యాన్స్ కి కూడా యావరేజ్ అనిపిస్తుంది సినిమా. ఇలాంటి కథలని ఇంకా ఆసక్తికరంగా తీయొచ్చు. స్క్రీన్ ప్లే మీద డైరెక్టర్ మరింత దృష్టిపెడితే బాగుండేది. మొత్తంగా తెగింపు సినిమా ఒక్కసారి చూడొచ్చు.