Karan Johar : కలెక్షన్స్ కూడా రావు కానీ కోట్లలో రెమ్యునరేషన్స్ కావాలి.. బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు..

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా పెద్ద హిట్ అయింది కానీ ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇలాగే చాలా సినిమాలకి జరుగుతుంది. సినిమా ఖర్చులో చాలా భాగం స్టార్స్...........

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 05:37 PM

Karan Johar : కలెక్షన్స్ కూడా రావు కానీ కోట్లలో రెమ్యునరేషన్స్ కావాలి.. బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు..

Karan Johar :  గత కొన్ని నెలలుగా బాలీవుడ్ హీరోలు, కథలు, సినిమాలపై తీవ్రంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాళ్ళ సినిమాలు వరుసగా పరాజయాల బాట కూడా పట్టాయి. బాలీవుడ్ ప్రేక్షకులే కాదు కొంతమంది ప్రముఖులు కూడా ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని విమర్శిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు, బాలీవుడ్ మాఫియాపై విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పై కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.

కానీ తాజాగా నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. బాలీవుడ్ లోని పలువురు హీరోల మీద తన ఫ్రస్ట్రేషన్ ను చూపించాడు కరణ్. తన పాడ్ కాస్ట్ లోని లేటెస్ట్ ఎపిసోడ్ లో బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ పాడ్ కాస్ట్ లో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా పెద్ద హిట్ అయింది కానీ ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇలాగే చాలా సినిమాలకి జరుగుతుంది. సినిమా ఖర్చులో చాలా భాగం స్టార్స్ రెమ్యునరేషన్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ హిందీలో కంటే తెలుగులో సినిమాలు చేసి డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. కొంతమంది హీరోలకి 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా రావు కానీ 20 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతారు. ఇలాంటివి నేను మాట్లాడితే నన్ను మర్డర్ చేసినా చేస్తారు. బాలీవుడ్ సినిమా నిర్మాణంలో చాలా శాతం డబ్బు స్టార్స్ కే వెళ్ళిపోతుంది అని అన్నారు.

Rohit Shetty : రామోజీ ఫిలింసిటీలో షూటింగ్.. చేజింగ్ సీన్స్ లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్..

దీంతో కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అందరూ కరణ్ ని తప్పుపడితే మొదటిసారి కరణ్ ఇలా బాలీవుడ్ హీరోలపై వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి కరణ్ చేసిన వ్యాఖ్యలని ఏ హీరోని ఉద్దేశించి అన్నాడో, ఏ హీరో దీనికి కౌంటర్ వేస్తాడో అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.