Waltair Veerayya Trailer : మెగా మాస్ జాతర.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్..

తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ ఆద్యంతం మాస్, యాక్షన్, కామెడీతో అదిరిపోయింది. చిరంజీవిని మొదట ఒక ఖైదీగా, సముద్రపు దొంగగా చూపించారు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయనని చూసి అనే పవర్ఫుల్ డైలాగ్ తో...............

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 06:31 PM

Waltair Veerayya Trailer : మెగా మాస్ జాతర.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్..

Waltair Veerayya Trailer :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, రవితేజ ముఖ్యపాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి ఎక్కువ లెంగ్త్ టైంలో కలిసి నటిస్తుండటంతో పాటు సినిమా పక్కా మాస్ గా ఉండబోతుంది అని ఇప్పటికే అర్దమవడంతో అభిమానులు అంచనాలు భారీగా పెంచుకుంటున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ రిలీజ్ చేస్తామని, అలాగే డిసెంబర్ 8న సాయంత్రం విశాఖలో సముద్రపు ఒడ్డున ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నామని ప్రకటించారు చిత్ర యూనిట్.

తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ ఆద్యంతం మాస్, యాక్షన్, కామెడీతో అదిరిపోయింది. చిరంజీవిని మొదట ఒక ఖైదీగా, సముద్రపు దొంగగా చూపించారు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయనని చూసి అనే పవర్ఫుల్ డైలాగ్ తో చిరు ఎంట్రీ ఇచ్చారు. సముద్రం మధ్యలో సముద్రపు అలల్లో గ్రాండ్ గా చిరంజీవిని చూపించారు. అలాగే స్టోరీ మలేషియాలో జరిగినట్టు అక్కడ కామెడీ, శృతి హాసన్ తో లవ్ చూపించారు. ఈ కామెడీ చూస్తే వింటేజ్ చిరంజీవి కచ్చితంగా గుర్తొస్తారు. మెగాస్టార్ స్టెప్పులు కూడా చూపించారు. అలాగే సినిమాలో క్యాథరిన్ థ్రెసా కూడా ఉంది. అలాగే తనతో పాటు సముద్రం దగ్గర ఉండేవాళ్ళకి కష్టాలొస్తే చిరంజీవి ఎలా ఎదుర్కున్నాడు అనే యాక్షన్ సీన్స్ చూపించారు. అయితే ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉన్నట్టు చూపించారు. విలన్స్ చిరంజీవిని వెతకడం కాదు, చిరంజీవి విలన్స్ ని వెతికినట్టు చూపించారు. ఇక రవితేజని కూడా ఫుల్ మాస్ ఎంట్రీతో చూపించారు. రికార్డ్స్ లో నీ పేరు ఉంది అన్నమాట అని విలన్ అంటే రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉన్నాయి అని చిరంజీవి చెప్తాడు. క్లైమాక్స్ లో సముద్రంలో భారీ డైట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక చివర్లో రవితేజకి, చిరంజీవికి మధ్య ఉన్న ఓ సూపర్ ఫన్నీ షాట్ ని ట్రైలర్ కి జత చేశారు. రవితేజ పోలీస్ అని ముందే తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో రవితేజ చిరంజీవిని ఉద్దేశించి.. హలో మాస్టారు కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, బాక్స్ బద్దలైపోద్ది అని చిరంజీవి డైలాగ్ చెప్తే చిరంజీవి ఏమో రవితేజని ఉద్దేశించి సిటీకి నీలాంటి కమిషనర్లు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు వీరయ్య లోకల్ అని రవితేజ డైలాగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది.

Karan Johar : కలెక్షన్స్ కూడా రావు కానీ కోట్లలో రెమ్యునరేషన్స్ కావాలి.. బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు..

మొత్తానికి వాల్తేరు వీరయ్య సినిమా ఫుల్ మాస్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్విస్ట్ కూడా ఏదో పెద్దదే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ ని చాలా బాగా కట్ చేశారు. వింటేజ్ బాస్ బ్యాక్ అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. మరోసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరంజీవి హిట్ కొట్టబోతున్నాడు అని అంతా ఫిక్స్ అయిపోయారు.