Rohit Shetty : రామోజీ ఫిలింసిటీలో షూటింగ్.. చేజింగ్ సీన్స్ లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్..

సిరీస్ లో ఓ చేజింగ్ సీన్ చేస్తుండగా నేడు ఉదయం రోహిత్ శెట్టి గాయపడినట్టు తెలుస్తుంది. రోహిత్ శెట్టి గాయపడగానే యూనిట్ దగ్గర్లో ఉన్న ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు.........

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 05:17 PM

Rohit Shetty : రామోజీ ఫిలింసిటీలో షూటింగ్.. చేజింగ్ సీన్స్ లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్..

Rohit Shetty :  గోల్ మాల్, సింగం, చెన్నై ఎక్స్ ప్రెస్, సింబా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ మాస్, యాక్షన్, కామెడీ సినిమాలని తెరకెక్కించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా ఓ షూటింగ్ లో గాయపడ్డాడు. ఈ స్టార్ డైరెక్టర్ ఇటీవలే రణవీర్ సింగ్, పూజా హెగ్డేతో సర్కస్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే ఓ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం తెరకెక్కిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. దీంతో డైరెక్టర్ రోహిత్ శెట్టి యూనిట్ తో గత కొన్ని రోజులుగా ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. తాజాగా నేడు ఉదయం ఈ సిరీస్ షూట్ లో భాగంగా చేజింగ్, ఫైట్ సీన్ చేస్తుంటే రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం. ఈ సిరీస్ కి రోహిత్ శెట్టి స్టంట్ మాస్టర్ గా కూడా చేస్తున్నట్టు పలువురు అంటున్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే సిరీస్ లో ఓ చేజింగ్ సీన్ చేస్తుండగా నేడు ఉదయం రోహిత్ శెట్టి గాయపడినట్టు తెలుస్తుంది.

Balakrishna: సోషల్ మీడియాలో ‘వీర సింహ రెడ్డి’ రచ్చ.. డైలాగ్స్ గురించే చర్చ!

రోహిత్ శెట్టి గాయపడగానే యూనిట్ దగ్గర్లో ఉన్న ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రమాదం జరిగింది, ఎక్కడ గాయం అయింది, ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనే వివరాలని బయటకి వెల్లడించలేదు.