RRR : ఆస్కార్ స్టేజ్‌పై కీరవాణి సంగీత ప్రదర్శన?

ఒక తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం సాధ్యమా? అని ఎవరు అనుకుని ఉండరు. కానీ ఇవాళ దానిని నిజం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. కాగా ఈ వేదిక పై RRR సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నాడట.

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 05:14 PM

RRR : ఆస్కార్ స్టేజ్‌పై కీరవాణి సంగీత ప్రదర్శన?

RRR : ఒక తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం సాధ్యమా? అని ఎవరు అనుకుని ఉండరు. కానీ ఇవాళ దానిని నిజం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో మన సినిమా నైపుణ్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసిన జక్కన.. RRR చిత్రంతో హాలీవుడ్ సినిమాలతోనే పోటీ పడే స్థాయికి తీసుకు వెళ్ళాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులు అందుకుంది. ఆస్కార్ తరువాత అత్యున్నత పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ ని సొంతం చేసుకొని హాలీవుడ్ మొత్తాన్ని మన వైపు చూసేలా చేశాడు.

RRR : ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ RRRకి.. జపాన్‌లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా..

ఇక ఈ సినిమాని భారత ప్రభుత్వం ఆస్కార్ కి అధికారికంగా పంపించనప్పటికీ, హాలీవుడ్ ప్రేక్షకులు ఆదరణతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ సాంగ్ ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని కైవసం చేసుకోగా, ఆస్కార్ కూడా గెలవడం పక్కా అంటున్నాయి హాలీవుడ్ మీడియా. మార్చి 12 న ఈ అవార్డుల పురస్కారం ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది.

కాగా ఈ వేదిక పై RRR సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నాడట. లైవ్ షో ఇవ్వమని ఆస్కార్ నిర్వాహకులు కీరవాణిని కోరారని ఒక వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఎ ఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీలోని జయహో సాంగ్ ని కూడా లైవ్ షో ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా నాటు నాటు సాంగ్ ని ప్రదర్శించమని కోరుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్త నిజామా? కదా? అనేది తెలియాలి అంటే RRR టీం నుంచి ప్రకటన రావాల్సిందే.