Viral News: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళు.. టైమ్ టేబుల్ వేసుకొని సంసారం!

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 05:01 PM

Viral News: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళు.. టైమ్ టేబుల్ వేసుకొని సంసారం!

Viral News: అక్కచెల్లెల్లు అంటే అనుబంధానికి, అప్యాయతలకు మారు రూపం అనిచెప్పుకుంటారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరికొకరుగా మెలుగుతారు. కానీ, వన్స్ పెళ్ళైతే భర్తే సర్వస్వంగా.. నేనూ, నా భర్త సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కష్ట సుఖాలలో అక్క చెల్లెళ్ళు తోడుగా ఉంటారు కానీ.. భర్తను పంచుకోవడం అనేది ఊహించుకున్నా ఉగ్రరూపం బయటకి వచ్చేస్తుంది. ఆ మాటకొస్తే ఏ స్త్రీకి అయినా తన భర్త తనకే సొంతం.. తనకే సర్వస్వం అనుకొనేలా ఉంటారు.

అప్పుడప్పుడు అక్కాచెల్లెళ్లు అనుకోకుండా ఒకరినే ప్రేమించి.. ఆతర్వాత తప్పక అతన్నే పెళ్లి చేసుకున్న ఘటనలు కొన్ని చూసినా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంటే చాలా అరుదు. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయగా.. ఇప్పుడు అలాంటిదే మరొకటి వైరల్ అవుతుంది. అప్పుడు జరిగింది మన ఇండియాలో కాగా.. ఇప్పుడు జరిగింది కెన్యాలో.

కెన్యాలో స్టీవో అనే వ్యక్తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ట్రిప్లెట్స్. అంటే ముగ్గురూ చూడటానికి ఒకే రకంగా ఉంటారు. కట్టూ బొట్టూ, హెయిర్ స్టైల్ ఇలా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేలా ఉంటారు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారు. భర్త ఏ రోజు ఎవరి దగ్గర ఉండాలో చార్ట్ వేసుకొని మరీ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటున్నారు.

స్టీవో మొదట ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన కేట్ ను కలుసుకోగా.. తర్వాత స్టీవోను తన ఇద్దరు సోదరీమణులకు కూడా పరిచయం చేసింది. స్టీవోకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు నచ్చారు. అలాగే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా స్టీవోను ఇష్టపడ్డారు. ముందుగా ముగ్గురితో సహజీవనం చేసి మరీ ఈ ట్రిప్లెట్స్ అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత స్టీవో ఎప్పుడు ఎవరితో ఉండాలో చార్ట్ తయారు చేసుకొని.. మేరీతో సోమవారం, కేట్ తో మంగళవారం, బుధవారం ఈవ్ తో ఉంటూ.. మిగతా నాలుగు రోజులు నలుగురు కలిసి మెలిసి గడుపుతారట.