Viral News: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బక్కెట్లు, క్యాన్లతో దొరికినకాడిని దోచుకుపోయిన స్థానికులు!

Viral News: ఓ డీజిల్ ట్యాంకర్ టర్న్ తీసుకొనే క్రమంలో బోల్తా పడింది. అందులో డ్రైవర్ సురక్షితంగానే బయటపడి ట్యాంకర్ కి కాపలా కాస్తున్నాడు. అయితే, డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందని తెలియగానే స్థానిక ప్రజలు బక్కెట్లు, క్యాన్లు, బిందెలు ఇలా ఎవరికి దొరికింది వారు తెచ్చుకొని దొరికిన కాడికి డీజిల్ ను దోచుకెళ్లారు. ఒకపక్క డ్రైవర్ వారిస్తున్నా వినకుండా బకెట్లతో ట్యాంకర్‌లోని డీజిల్‌ను ఎత్తుకెళ్లిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సమీపంలో ఓ డీజిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. డీజిల్ తో వస్తున్న ఓ ట్యాంకర్ మూల మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. రహదారి పక్కకు వెళ్లిన క్రమంలో ఒక పక్కకు వరిగిపోయింది. డీజిల్ ట్యాంకర్ ను బయటకు తెచ్చేందుకు చాలా సమయం పాటు డ్రైవర్ ప్రయత్నిచినా ఫలితం లేకుండా పోయింది. ఈలోగా డీజిల్ లారీ ప్రమాదానికి గురైన విషయం సమీప గ్రామస్తులకు తెలిసింది.
ఇదే అదనుగా గ్రామస్తులు చెలరేగిపోయారు. క్యాన్లు, బకెట్లు తీసుకొచ్చి డిజీల్ తీసుకెళ్లారు. డ్రైవర్ ఎంత చెప్పిన వినకుండా గ్రామస్తులు డీజిల్ ఎత్తుకెళ్లారు. వాహనం పడిపోయిందే.. సాయం చేద్దామనే ఆలోచనే ఎవరికీ లేదు. దొరికిందే ఛాన్స్ అని వాళ్ళు ఎత్తుకెళ్లడమే కాదు.. తెలిసినవాళ్లకు ఫోన్ చేసి కూడా సమాచారం ఇచ్చారు. దొరికినకాడికి నింపుకుని వెళ్లారు. ఆ ట్యాంకర్ డ్రైవర్‌ను ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్థానికులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి, ప్రమాదం ఎలా జరిగిందిదన్నది మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సమాజంలో మంచి కనుమరుగై చాలా కాలమే అయిందనేది దానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఫ్రీగా వస్తే దేన్ని వదలని జనాలు.. ఆ మధ్య చేపల లారీ, బీర్ లోడ్ తో వెళ్తున్న లారీలు బోల్తాపడినప్పుడు కూడా ఇలానే ప్రవర్తించారు.