NTR30 : ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విక్రమ్?

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30. ఈ సినిమాకి ఈ నెలలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు, ఇటీవల జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. కాగా..

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 04:46 PM

NTR30 : ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విక్రమ్?

NTR30 : టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ హీరో తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో తన 30వ సినిమా ఉండబుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మేకర్స్ పక్కాగా అని ప్లాన్ చేసుకున్నా తరువాతే సెట్స్ పైకి వెళ్దాం అనుకోవడంతో, మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. దీంతో ఈ సినిమా పై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

NTR : అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల పై ఎన్టీఆర్ ఆగ్రహం..

ఈ సినిమా ఒక దివిలో జరగనుందని, అండర్ వాటర్ కాన్సెప్ట్ అని కథనాలు వస్తున్నాయి. తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర హీరోతో సమానంగా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇక ఈ పాత్ర కోసం దర్శకుడు తమిళ విలక్షణ నటుడు విక్రమ్ ని తీసుకొనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే విక్రమ్ ని కలిసి కథ వినిపించనున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా ఈ సినిమాకి ఈ నెలలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు, ఇటీవల జరిగిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 20 లేదంటే అంతకంటే ముందే మొదలు కానున్నట్లు వెల్లడించాడు. ఆల్రెడీ చెప్పిన డేట్ 2024 ఏప్రిల్ 5కి ఈ సినిమాని తప్పకుండా రిలీజ్ చేస్తాము అంటూ తెలియజేశాడు. ఇక ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది.