RRR : ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ RRRకి.. జపాన్‌లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా..

ఇప్పటికే RRR సినిమా జపాన్ లో దాదాపు 25 కోట్లు కలెక్ట్ చేసి జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. తాజాగా RRR సినిమా జపాన్ లో మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది. RRR సినిమా జపాన్ లో...........

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 02:19 PM

RRR : ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ RRRకి.. జపాన్‌లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమా..

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచమంతా ఎంతటి బాఱె విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మన దేశంలోనే కాకా విదేశాల్లో కూడా RRR తన సత్తా చాటింది. ఇక హాలీవుడ్ లో అయితే సాధారణ ప్రేక్షకుల నుంచి టాప్ టెక్నీషియన్స్ వరకు RRR సినిమాని, దర్శకుడు రాజమౌళిని అభినందిస్తున్నారు. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

ఇప్పటికే RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులని వివిధ విభాగాల్లో గెలుచుకుంది. ఇటీవలే RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకొని చరిత్ర సృష్టించింది. RRR సినిమా ప్రపంచంలోని పలు దేశాల్లో రిలీజయింది. జపాన్ లో కొద్దిగా లేట్ గా మూడు నెలల క్రితమే RRR సినిమా భారీగా రిలీజ్ అయింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలతో కలిసి వెళ్లి మరీ ఇక్కడ చేసినట్టే అక్కడ కూడా RRR సినిమా ప్రమోషన్స్ చేశారు. జపాన్ అభిమానులు RRR సినిమాపై, మన హీరోలపై విపరీతమైన ప్రేమ చూపించారు.

ఇప్పటికే RRR సినిమా జపాన్ లో దాదాపు 25 కోట్లు కలెక్ట్ చేసి జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. తాజాగా RRR సినిమా జపాన్ లో మరో సరికొత్త రికార్డు సెట్ చేసింది. RRR సినిమా జపాన్ లో 42 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు సెలబ్రేట్ చేసుకుంటుంది. 114 కేంద్రాల్లో షిఫ్టుల వారీగా 100 రోజులు ఆడింది. దీంతో జపాన్ లో 100 రోజులు ఆడిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా RRR రికార్డ్ సెట్ చేసింది. ఒకప్పుడు 50, 100, 150, 175 రోజులు, ఇన్ని సెంటర్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అవి కనుమరుగయిపోయిన సందర్భంలో మన RRR సినిమా ఎక్కడో జపాన్ దేశంలో ఈ రికార్డు సాధించడంతో చిత్రయూనిట్ తో పాటు, అభిమానులు, సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Taraka Ratna: తారకరత్నకు క్రిటికల్ ట్రీట్మెంట్.. బెంగళూరుకి చంద్రబాబు, జూ.ఎన్టీఆర్?

ఈ విషయాన్ని రాజమౌళి అధికారికంగా కూడా పోస్ట్ చేస్తూ.. ఒకప్పుడు సినిమా 175 రోజులు, 100 రోజులు ఆడింది అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజినెస్ అంతా మారిపోయింది. ఆ పాత జ్ఞాపకాలని మళ్ళీ జపాన్ అభిమానులు పరిచయం చేశారు. లవ్ యు, థ్యాంక్ యు జపాన్ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు.