Pushpa 2 : పుష్ప 2 మొదలెట్టేశారుగా.. అంచనాలు పెంచేస్తున్న సుకుమార్..

Kaburulu

Kaburulu Desk

October 18, 2022 | 12:43 PM

Pushpa 2 : పుష్ప 2 మొదలెట్టేశారుగా.. అంచనాలు పెంచేస్తున్న సుకుమార్..

Pushpa 2 :  అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెల్సిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్లని తీసుకొచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. ఇక ఈ సినిమాలోని పాటలు, అల్లు అర్జున్ మేనరిజమ్స్ ప్రపంచమంతటా వైరల్ అయ్యాయి.

పుష్ప సినిమా రిలీజ్ అయి 10 నెలలు అవుతున్నా ఇంకా పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దేశమంతటా పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Premi Viswanath : నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వంటలక్క..

తాజాగా చిత్ర యూనిట్ సుకుమార్ షూటింగ్ స్పాట్ లో వర్క్ చేస్తున్న ఓ ఫోటో పోస్ట్ చేసి.. పుష్ప పనులు మొదలయ్యాయి. ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి అంటూ పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ పై స్పెషల్ ఫోటోషూట్ తీస్తున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. దీంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.