Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసినిమా.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్..

Kaburulu

Kaburulu Desk

October 18, 2022 | 12:52 PM

Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మొదటిసినిమా.. యశోద రిలీజ్ డేట్ ఫిక్స్..

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మెయిన్ లీడ్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్పలో కేవలం ఐటెం సాంగ్ లో కనిపించింది. సినిమాలు రిలీజ్ కాకపోయినా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. ఫ్యాన్స్ సమంత నుండి సినిమా వచ్చి చాలా రోజులైందని నిరాశ చెందుతున్నారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది సమంత.

సమంత మెయిన్ లీడ్ లో లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యశోద సినిమాలో సమంత మెయిన్ లీడ్ గా చేస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, ఉన్ని ముకుందన్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Pushpa 2 : పుష్ప 2 మొదలెట్టేశారుగా.. అంచనాలు పెంచేస్తున్న సుకుమార్..

ఇప్పటికే ఆగస్టు లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడి నవంబర్ 11న రిలీజ్ కానుంది. దీంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.