Sukumar : పుష్ప సినిమా హిట్ అవ్వడానికి సోషల్ మీడియా కూడా కారణమే.. అందుకే పుష్ప 2లో కూడా..
సుకుమార్ మాట్లాడుతూ.. నేను సినిమాకు సంబంధించిన డైలాగ్స్ రాసేటప్పుడు, పాటలు రాయించేటప్పుడు కచ్చితంగా సోషల్ మీడియా ని దృష్టిలో పెట్టుకుంటాను. సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్.................

Sukumar : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. సౌత్ తో పాటు నార్త్ లో కూడా అనూహ్యంగా సూపర్ హిట్ అయింది పుష్ప. ఇక పుష్ప సినిమాలోని పాటలు, డ్యాన్సులు, డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలు, డైలాగ్స్ రీల్స్ రూపంలో బాగా ప్రమోట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సినిమా విజయానికి సోషల్ మీడియా కూడా బాగా ఉపయోగపడింది.
ఇప్పుడు ఇదే మాట సుకుమార్ కూడా అన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సుకుమార్ పాల్గొనగా సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా విజయంలో సోషల్ మీడియా కూడా భాగమైంది అన్నారు.
Kanak Rele : లెజెండరీ క్లాసిక్ డ్యాన్సర్ కన్నుమూత.. విషాదంలో నృత్య పరిశ్రమ..
సుకుమార్ మాట్లాడుతూ.. నేను సినిమాకు సంబంధించిన డైలాగ్స్ రాసేటప్పుడు, పాటలు రాయించేటప్పుడు కచ్చితంగా సోషల్ మీడియా ని దృష్టిలో పెట్టుకుంటాను. సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో వస్తాయని తెలుసు. మనం రాసేవి అభిమానులని, ప్రేక్షకులని వీటిద్వారే ప్రభావితం చేస్తాయి. పుష్ప విజయం వెనుక సోషల్ మీడియా కూడా ఒక భాగమే. పుష్ప సినిమాలోని చాలా డైలాగ్స్, సాంగ్స్, స్టెప్స్ ప్రపంచమంతటా సోషల్ మీడియా వల్లే పాపులర్ అయ్యాయి. అందుకే ఇప్పుడు పుష్ప 2 లోని డైలాగ్స్, సాంగ్స్ విషయంలో సోషల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాము అని అన్నారు. దీంతో ఈ సారి పుష్ప 2 లో కూడా అదిరిపోయే డైలాగ్స్, సాంగ్స్ ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.