Pushpa 2 shooting : పుష్ప 2 షూటింగ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

అల్లు అర్జున్ నుంచి ఇప్పుడు అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప రిలీజ్ అయిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇటీవలే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ వైజాగ్ లో............

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 01:38 PM

Pushpa 2 shooting : పుష్ప 2 షూటింగ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

Pushpa 2 shooting :  అల్లు అర్జున్ నుంచి ఇప్పుడు అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప రిలీజ్ అయిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇటీవలే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ని చూసే ఛాన్స్ గెలుచుకోవచ్చని నిర్మాత బన్నీ వాసు ఓ ఆఫర్ ప్రకటించాడు.

యువ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుంచి రెండో పాటని VVIT కాలేజీ గుంటూరులో రిలీజ్ చేశారు. ‘ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం..’ అనే ఈ పాట ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ఈ ఆఫర్ ని ప్రకటించాడు.

Rocking Rakesh-Sujatha : జబర్దస్త్ కమెడియన్‌తో టీవీ యాంకర్ వివాహం.. గాసిప్ నిజమైందిగా..

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలోని ఈ సాంగ్ ని రీల్స్ గా చేసి సోషల్ మీడియాలో గీత ఆర్ట్స్ ని ట్యాగ్ చేయండి. అలా రీల్స్ చేసిన వారిలో బాగా చేసిన 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలకి వినరో భాగ్యము విష్ణు కథ సినిమాని ఫ్రీగా చూపిస్తాము. అంతే కాకుండా పుష్ప 2 షూటింగ్ కూడా చూసే ఛాన్స్ కలిపిస్తాము అని ప్రకటించారు. దీంతో బన్నీ అభిమానులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు, ప్రేక్షకులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనడానికి తహతహలాడుతున్నారు. మరి ఈ కాంటెస్ట్ లో గెలిచి పుష్ప 2 షూటింగ్ ని చూసే ఛాన్స్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో చూడాలి.