Premi Viswanath : నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వంటలక్క..

Kaburulu

Kaburulu Desk

October 17, 2022 | 11:49 AM

Premi Viswanath : నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వంటలక్క..

Premi Viswanath :  మలయాళం ఆర్టిస్ట్ ప్రేమి విశ్వనాధ్ తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. ఆ సీరియల్ లో తన క్యారెక్టర్ పేరు వంటలక్క బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ కి వచ్చే టీఆర్పీ చూసి అంతా ఆశ్చర్యపోయారు. వంటలక్క వల్లే ఆ రేంజ్ టీఆర్పీ వచ్చింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో భారీగా అభిమానులని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాధ్. సీరియల్ లో తన క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రేటింగ్ పడిపోవడంతో రేటింగ్ కోసం మళ్ళీ ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చారంటే తనకి ఏ రేంజ్ అభిమానులు ఉన్నారో తెలుస్తుంది.

ప్రేమి విశ్వనాధ్ తెలుగులోనే కాక మలయాళం సీరియల్స్, కొన్ని సినిమాలతో కూడా బిజీగా ఉంది. తాజాగా నాగచైతన్య సినిమాతో కార్తీక దీపం వంటలక్క టాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రేమి విశ్వనాధ్ ని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

God Father : గాడ్ ఫాదర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా..

దీంతో బుల్లితెరపై ఇన్నాళ్లు మెరిపించిన వంటలక్క ఇప్పుడు వెండితెరపై కూడా కనువిందు చేయనుంది అని తెలియడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్ పాపులారిటీ ఎంతో కొంత కచ్చితంగా ఈ సినిమాకి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు.