Pushpa 2 : దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం బాగోలేదు.. బన్నీ వాసు కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 10:57 AM

Pushpa 2 : దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం బాగోలేదు.. బన్నీ వాసు కామెంట్స్!

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా, టాలీవుడ్ లెక్కలు మాస్టర్ తెరకెక్కించిన సినిమా ‘పుష్ప ది రైస్’. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుని అల్లు అర్జున్ కెరీర్ లోనే మైల్ రాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లోను ప్రజాధారణ పొంది తన సత్తా ఏంటో చూపించింది.

Allu Arvind : అనుపమ నా ‘కూతురు’లా అనిపిస్తుంది.. అల్లు అరవింద్!

దీంతో ఇటీవలే రష్యాలో డబ్ చేసి విడుదల చేశారు మేకర్స్. దాదాపు 774 స్క్రీన్స్ లో విడుదలయిన ఈ సినిమా ప్రీమియర్స్ కి మూవీ టీమ్ హాజరయ్యి సందడి చేశారు. ఇక రష్యా నుంచి తిరిగి వచ్చిన చిత్ర యూనిట్ పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ కి వెళ్లకపోవడంతో అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా నిన్న ’18 పేజిస్’ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ సన్నిహితుడైన బన్నీ వాసు ‘పుష్ప ది రూల్’ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. “ప్రెస్ మీట్ కి రావాలంటూ దర్శకుడు సుకుమార్ కి కాల్ చేశాను. అయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పారు. అలాగే రేపటి నుంచి పుష్ప 2 చిత్రీకరణ కూడా మొదలుపెడుతున్నట్లు చెప్పారు” అంటూ వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.