Allu Arvind : అనుపమ నా ‘కూతురు’లా అనిపిస్తుంది.. అల్లు అరవింద్!

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 10:33 AM

Allu Arvind : అనుపమ నా ‘కూతురు’లా అనిపిస్తుంది.. అల్లు అరవింద్!

Allu Arvind : హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమపరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ-2′. ఈ సినిమాతో సూపర్ హిట్టు అందుకున్న ఈ జంట మళ్ళీ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి కంప్లీట్ లవ్ స్టోరీ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ’18 పేజిస్’ అంటూ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో ఈ నెల 23న థియేటర్ లో సందడి చేయనున్నారు.

Upasana : మెంటల్ హెల్త్ బాగుండటానికి ఉపాసన ఏం టిప్స్ చెప్పిందో తెలుసా??

ఇక సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నిన్న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో హీరోహీరోయిన్లుతో పాటు నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘నాకు కూతురు ఉంటే అనుపమలా ఉండాలి అనిపిస్తుంది’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“అనుపమ మనసులో ఏమి దాచుకోదు, ఆమె లోపల ఏమి అనుకుంటదో అదే తన మొహంలో చూపిస్తుంది. తను చాలా ట్రాన్స్‌పరెంట్” అంటూ ప్రశంసించాడు. కాగా ’18 పేజిస్’ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించగా, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించిన సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.