Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ రీమేక్‌నా?

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 11:45 AM

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ రీమేక్‌నా?

Pawan Kalyan : గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ తెరపై రానుంది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇక పవన్ ఫాన్స్ కి అయితే ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ప్లాప్ లు తరువాత గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్టు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు ఆ సమయంలో. దీంతో మళ్ళీ ఈ కలయికలో ఒక సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Pushpa 2 : దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం బాగోలేదు.. బన్నీ వాసు కామెంట్స్!

ఇక ఆ నిరీక్షణకు తెర దించుతూ.. నిన్న ఎటువంటి ప్రకటన లేకుండా, పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా లాంచ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు హరీష్-పవన్‌లు. అయితే గత కొన్నిరోజులుగా వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా ‘తేరీ’ రీమేక్ అంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఏ మూవీకి రీమేక్ కాదంటూ తేలిపోయింది.

ఈ సినిమాకి దర్శకుడు హరీష్ శంకర్ కథని అందిస్తున్నట్లు నిన్న తెలియజేయడంతో, రీమేక్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అర్ధమైపోయింది. అలాగే ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు కె దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నాడు హరీష్ శంకర్. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.