Kanak Rele : లెజెండరీ క్లాసిక్ డ్యాన్సర్ కన్నుమూత.. విషాదంలో నృత్య పరిశ్రమ..

ఇటీవల సినీ, కళా రంగాలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లెజెండరీ క్లాసికల్ డ్యాన్సర్ కనక్‌ రెలే మరణించారు. నేడు(ఫిబ్రవరి 23) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన కనక్‌ రెలే చికిత్స తీసుకుంటూ 85 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.................

Kaburulu

Kaburulu Desk

February 23, 2023 | 03:49 PM

Kanak Rele : లెజెండరీ క్లాసిక్ డ్యాన్సర్ కన్నుమూత.. విషాదంలో నృత్య పరిశ్రమ..

Kanak Rele :  ఇటీవల సినీ, కళా రంగాలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లెజెండరీ క్లాసికల్ డ్యాన్సర్ కనక్‌ రెలే మరణించారు. నేడు(ఫిబ్రవరి 23) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన కనక్‌ రెలే చికిత్స తీసుకుంటూ 85 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కనక్‌ రెలే మృతితో నృత్య పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ స్టార్స్, డ్యాన్సర్లు ఆమెకు సంతాపం తెలియచేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అరిపిస్తున్నారు.

గుజరాత్ లో జమించిన కనక్‌ రెలే చిన్నవయసులోనే స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొంది. అనేక రకాల క్లాసికల్ డ్యాన్సులని చిన్నప్పటి నుంచే నేర్చుకుంది. మోహీని అట్టం డ్యాన్స్ లో అత్యంత ప్రావీణ్యం సంపాదించింది. పలు రకాల శాస్త్రీయ నృత్యాలతో అనేక ప్రదర్శనలు ఇచ్చింది కనక్‌ రెలే. అలాగే సినీ పరిశ్రమలోని చాలా మంది స్టార్స్ కి శాస్త్రీయ నృత్యాన్ని నేర్పించింది ఈమె.

Genelia Deshmukh : అందుకే ఇన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాను.. జెనీలియా

అంతేకాకుండా కనక్‌ రెలే నలంద కళా మహావిద్యాలయం స్థాపించి ఎంతోమందికి నృత్యకళని అందిస్తున్నారు. దీనికి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేస్తున్నారు. ఈమె శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవలకు గాను భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందించింది. కనక్‌ రెలే మరణంతో అనేకమంది డ్యాన్సర్లు, కళాకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.