Genelia Deshmukh : అందుకే ఇన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాను.. జెనీలియా

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ మొదలుపెట్టారు, ఇన్ని రోజులు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అని అడగడంతో జెనీలియా మాట్లాడుతూ...............

Kaburulu

Kaburulu Desk

February 23, 2023 | 03:47 PM

Genelia Deshmukh : అందుకే ఇన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాను.. జెనీలియా

Genelia Deshmukh : ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఉన్న జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. తెలుగులో బాయ్స్, బొమ్మరిల్లు, హ్యాపీ, ఢీ, ఆరెంజ్, రెడీ.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించింది. చివరగా 2012 లో తెలుగులో నా ఇష్టం సినిమా చేసింది జెనీలియా. అనంతరం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయింది.

ఆ తర్వాత పూర్తి స్థాయిలో హీరోయిన్ గా చేయకపోయినా అడపాదడపా కొన్ని బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇటీవలే మళ్ళీ పూర్తి స్థాయిలో సినిమాలు చేయడం మొదలుపెట్టింది జెనీలియా. తన భర్త నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి ఇటీవలే వేద్ అనే సినిమా చేసింది. తెలుగులో నాగచైతన్య, సమంత కలిసి నటించిన మజిలీ సినిమాని మరాఠీలో వేద్ గా తెరకెక్కించారు. ఈ సినిమాతో పూర్తిస్థాయిలో మళ్ళీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. వేద్ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం జూనియర్ అనే మరో సినిమాలో కూడా పూర్తి స్థాయిలో నటిస్తుంది.

Kangana Ranaut : మరోసారి బాలీవుడ్ మాఫియా బయటపడింది అంటూ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై కంగనా ఫైర్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వరుస సినిమాలు మళ్ళీ మొదలుపెట్టారు, ఇన్ని రోజులు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అని అడగడంతో జెనీలియా మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నాను. పిల్లలు పుట్టాక వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేంతవరకు వారికి సమయం ఇవ్వాలి అనుకున్నాను. భార్యగా, తల్లిగా నా వాళ్ళకి టైం ఇవ్వాలి అనుకోని ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రితేష్ కూడా నన్ను ఎప్పట్నుంచో పూర్తి స్థాయిలో నటించమని ప్రోత్సహిస్తున్నాడు. అందుకే మళ్ళీ సినిమాలు చేస్తున్నాను అని తెలిపింది. జెనీలియా మళ్ళీ సినిమాల్లోకి వచ్చినందుకు జెనీలియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.