Boney Kapoor : శ్రీదేవిని గుర్తుచేసుకొని స్టేజిమీదే ఏడ్చేసిన బోనీకపూర్

Kaburulu

Kaburulu Desk

October 12, 2022 | 02:56 PM

Boney Kapoor : శ్రీదేవిని గుర్తుచేసుకొని స్టేజిమీదే ఏడ్చేసిన బోనీకపూర్

Boney Kapoor :  ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతటి స్టార్ హీరోయిన్ అలా సడెన్ గా మరణించడంతో అభిమానులు, ప్రేక్షకులు దేశవ్యాప్తంగా షాకయ్యారు. అయితే శ్రీదేవి సినిమాలు మానేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే ఆ రోల్ చేశాను..

తాజాగా శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా పదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వేడుకని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త బోనీకపూర్ అతిధిగా వచ్చారు. స్టేజి మీద బోనీకపూర్ మాట్లాడుతూ భార్యని తలుచుకుంటూ ఏడ్చేశాడు. ఈ దృశ్యం అక్కడున్న వాళ్ళని కూడా కంటతడి పెట్టించింది. బోనీకపూర్ ఏడుస్తుండగా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్ర నిర్మాత బాల్కీ ఆయన్ని ఓదార్చారు. దీంతో బోనికపూర్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో బాలీవుడ్ లో వైరల్ గా మారింది.