Unstoppable 2 : ఓ వైపు ఎంటర్టైన్మెంట్.. ఓ వైపు పొలిటికల్.. అదిరిపోయిన అన్‌స్టాపబుల్‌ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో..

Kaburulu

Kaburulu Desk

October 12, 2022 | 03:01 PM

Unstoppable 2 : ఓ వైపు ఎంటర్టైన్మెంట్.. ఓ వైపు పొలిటికల్.. అదిరిపోయిన అన్‌స్టాపబుల్‌ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో..

Unstoppable 2 :  బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈషో బాగా విజయవంతం అవ్వడం, పలు రికార్డులని సాధించడంతో సీజన్ 2 కూడా మొదలుపెట్టేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం విశేషం. దీంతో ఈ షో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమో ఓ పక్కన సరదాగా సాగుతూనే మరోపక్క పొలిటికల్ ప్రశ్నలు, వివాదాస్పద అంశాలు కూడా మాట్లాడారు. చంద్రబాబు చేసిన అల్లరి పనులు గుర్తు చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఇద్దరం కలిసి బాగా తిరిగేవాళ్ళం అని చెప్పారు. అలాగే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు ఎన్టీఆర్ ని అంటూ ఆయనకి నెగిటివ్ గా ఉన్న అంశంపై కూడా ఈ ఎపిసోడ్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం గురించి, బ్రాహ్మణితో పెళ్లి గురించి, గతంలో లోకేష్ ఫారెన్ లో అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫోటో వైరల్ అయిన దాని గురించి కూడా మాట్లాడటంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది.

పర్సనల్, ఎంటర్టైన్మెంట్ విషయాలే కాకుండా, రాజకీయంగా వివాదాస్పద అంశాలు కూడా మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ కోసం సినీ, రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఈ ప్రోమో చర్చకి దారి తీసింది. ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.