Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త… హెలిక్యాప్టర్ లో వీక్షించే అవకాశం…!

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 10:00 PM

Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త… హెలిక్యాప్టర్ లో వీక్షించే అవకాశం…!

శ్రీరామనవమి సందర్భంగా రామభక్తులకు ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది. శ్రీరాముడి పవిత్ర నగరమైన అయోధ్యలో రామ నవమి సందర్భంగా అయోధ్యను సందర్శించే భక్తులు, పర్యాటకులు, అతిథులను హెలికాప్టర్‌లో శ్రీరాముడికి సంబంధించిన ప్రదేశాలకు తీసుకువెళతారు. దీనికి సంబంధించిన వివరాలేమిటో ఇపుడు తెలుకుందాం…!

రాములవారి జన్మస్థానమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణమౌతున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ఆలయాన్ని, ఇంకా చుట్టూ ఉన్నటువంటి రాముడేలిన రాజ్యాన్ని, ఇతర పర్యాటక ప్రదేశాలన్నింటినీ చుట్టేసి రావడానికి  ఒక చక్కటి అవకాశం మన ముందు ఉండబోతుంది. హెలిక్యప్టర్ లో గగన విహారం చేస్తూ మొత్తం రాజ్యాన్ని వీక్షించే అవకాశం భక్తులకు కలగనుంది.

ఈ సౌకర్యం వచ్చే 15 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ జాయ్‌రైడ్‌కు ఒక్కొక్కరికి ఎనిమిది నిమిషాలకు రూ. 3,000గా నిర్ణయించారు. ఈ సేవను పర్యాటక శాఖ ప్రారంభించింది. భక్తులు హెలికాప్టర్‌లో ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అయోధ్య ధామ్‌ని సందర్శించవచ్చు. హెలికాప్టర్‌లో ఒకేసారి ఏడుగురు ప్రయాణించవచ్చు.ఆకాశం నుంచి అయోధ్యలోని సరయూ నది, రామజన్మభూమి, హనుమాన్‌గర్హి తదితర ఆలయాలను చూడవచ్చు