Ram Temple inauguration: రామజన్మభూమి అయోధ్య రామాలయం ప్రారంభమెప్పుడో తెలుసా…!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:43 AM

Ram Temple inauguration: రామజన్మభూమి అయోధ్య రామాలయం ప్రారంభమెప్పుడో తెలుసా…!

ఆదర్శపురుషుడు, హిందువుల ఇలవేల్పు అయిన శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యా నగరంలో రామాలయ నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎప్పుడో తెలుసుకున్నారా…? ప్రారంభ ఉత్సవాలు ఏవిధంగా ఉంటాయో…? ఇపుడు తెలుసుకుందాం!

2024 ఎన్నికలకు కొద్దిగా ముందు 2024 జనవరి 1వ తేదీన భవ్యమైన రామమందిరం ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. కేవలం రామమందిరమే కాకుండా 1-2 ఏళ్లలో త్రిపుర సుందరి దేవి మందిరం కూడా నిర్మిస్తామని.. ఈ అద్భుత దృశ్యాలను మొత్తం ప్రపంచం చూస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల ఆశలు నెరవేరబోయే రోజు అత్యంత దూరమేమి లేదు…! మరి ఆ రోజుకై ఎదురుచూపులు చూస్తూ ఉన్న లక్షలాది హిందువుల కన్నులు కనువిందు కాబోతున్నాయి. ఎంతో వివాదాస్పదంగా నిలిచిన అయోధ్య భూమిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ముస్లింలకూ, హిందువులకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సమానమైన న్యాయం చేయడంతో… రామజన్మభూమిపై రాములవారి దర్శనం చేసుకోబోతున్నాం.