Home » Author » M N
Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారక రత్న గుండె పోటుకి గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు మొదట కుప్పంలో అందించారు.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తీవ్ర గుండె పోటు నేపథ్యంలో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ప్రస్తుతం గుండె సహా ఇతర ప్రధాన అవయవాలన్నీ ప్రస్తుతం సరిగ్గానే పనిచేస్తున్నట్లు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు […]
Tirumala: కలియుగ దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రత్యేకత ఉందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ లడ్డూలోనే భక్తి భావం తీణికిసలాడుతుంది. దేశంలో ఎన్నో ఆలయాలున్నా.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ తయారీకి టీటీడీ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం ద్వారా నిత్యం లక్షలలో లడ్డూలు వితరణ అవుతుంటాయి. బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, ప్రత్యేకమైన, విశిష్టమైన రోజులలో […]
Assembly Sessions: తెలంగాణలో రాజకీయాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. పట్టుమని పది నెలలు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారమే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్థాయి దాటి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడం.. అది కూడా బడ్జెట్ సమావేశాలు కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయమని అంచనా […]
Gadapa Gadapaku: ఏపీలో వైసీపీ గడప గడపకు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టగా.. ప్రజాక్షేత్రంలో ఒక్కోసారి ఎమ్మెల్యే, మంత్రులకు సైతం ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సొంత నియోజకవర్గంలో స్థానికులు ఝలక్ ఇచ్చారు. […]
Telangana BJP: బీజేపీ అంటేనే ఎలక్షన్ స్ట్రాటజీతోనే ఎదిగిన పార్టీగా పేరుంది. మోడీ-షా ద్వయం స్ట్రాటజీలతోనే దేశవ్యాప్తంగా బీజేపీకి వైభవాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే కనుక బలమైన ప్రతిపక్ష పార్టీగా పుంజుకుంది. అయితే.. బీఆర్ఎస్ ను ఓడించి సీఎం పీఠాన్ని దక్కించుకోగలదా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు మెట్రో నగరాలతో పాటు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ సత్తా చాటినా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించే స్థాయి కనిపించడం లేదు. అయితే.. ఈసారి […]
Telangana Budget 2023: తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా […]
Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడే నిర్వహించనున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, […]
KP Vivekananda: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(వివేక్) టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మి నారాయణను కూడా కలిశారు. ప్రస్తుతం వైజాగ్ లో విస్తృతంగా పర్యటిస్తున్న లక్ష్మి నారాయణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ విస్తరణలో […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన మలుపు తీసుకుంది. ఈసారి కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో మొత్తం 17 మందిపై అభియోగాలు మోపింది. రెండో ఛార్జి షీట్ […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 7వ రోజు పూర్తయింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిన పాదయాత్ర పట్టణంలో ఉండగా నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు […]