Ram Charan : టాలీవుడ్, బాలీవుడ్ భేదం పోగొట్టింది రాజమౌళినే.. అమెరికాలో చరణ్ వ్యాఖ్యలు..
రామ్ చరణ్ అక్కడి హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా అమెరికాలో ప్రముఖ రేడియో షో టాక్ ఈజీలో చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ టాక్ షోలో చరణ్ ఇండియన్ సినిమాలు, RRR గురించి, ఆస్కార్ గురించి మాట్లాడాడు..............

Ram Charan : RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించింది అందరికి తెలిసిందే. ప్రేవు, ప్రఖ్యాతలు, కలెక్షన్స్ తో పాటు అవార్డులు కూడా సాధిస్తుంది. RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుకలు మరో నాలుగు రోజుల్లో ఉండటంతో ప్రస్తుతం రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి.. మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ అక్కడి హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా అమెరికాలో ప్రముఖ రేడియో షో టాక్ ఈజీలో చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ టాక్ షోలో చరణ్ ఇండియన్ సినిమాలు, RRR గురించి, ఆస్కార్ గురించి మాట్లాడాడు. బాహుబలి, RRR సినిమాలతో దేశమే కాదు ప్రపంచమంతా ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసాడు రాజమౌళి. ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళే కనీసం తెలుగు సినిమాలను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని చరణ్ ఈ షోలో ప్రస్తావించాడు.
Kajal Aggarwal : నా కొడుక్కి నేను నటించిన వాటిల్లో ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తాను..
టాక్ ఈజీలో చరణ్ మాట్లాడుతూ.. ఇండియాలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. భాషని బట్టి సినిమాలు తెరకెక్కుతాయి. అయితే మా దేశంలో సౌత్, నార్త్ అనే భావన పోగొట్టింది మాత్రం రాజమౌళినే. రాజమౌళి తన బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా అని చెప్పేలా చేశారు. ఒకప్పుడు మేము బాలీవుడ్ లో సినిమాలు చేయాలంటే కష్టమే. కానీ ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే మా దగ్గరికి వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఇదంతా రాజమౌళి వల్లే అని తెలిపాడు.