RRR Movie : అమెరికాలో RRR రీ రిలీజ్.. థియేటర్స్ మోత మోగిపోతున్నాయిగా..
ఆస్కార్ మరికొన్ని రోజుల్లో ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో RRR సినిమాని భారీగా రీ రిలీజ్ చేశారు. అమెరికాలో సంవత్సరం తర్వాత కూడా RRR సినిమా రీ రిలీజ్ చేసినా భారీ స్పందన వస్తుంది. హాలీవుడ్ ప్రేక్షకులు RRR సినిమాని.................

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు పేరు, ప్రఖ్యాతలు, భారీ కలెక్షన్స్ సాధించిన RRR సినిమా గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ అవార్డులు సాధిస్తుంది. ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ఆస్కార్ కి నామినేట్ అయి చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఇప్పటికే RRR టీం అంతా అమెరికా వెళ్లారు.
ఆస్కార్ మరికొన్ని రోజుల్లో ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో RRR సినిమాని భారీగా రీ రిలీజ్ చేశారు. అమెరికాలో సంవత్సరం తర్వాత కూడా RRR సినిమా రీ రిలీజ్ చేసినా భారీ స్పందన వస్తుంది. హాలీవుడ్ ప్రేక్షకులు RRR సినిమాని మళ్ళీ థియేటర్స్ లో చూసేందుకు థియేటర్స్ కి బారులు తీరుతున్నారు. లాస్ ఏంజిల్స్ లో ఉన్న అమెరికాలోని పెద్ద థియేటర్ లో 1647 సీట్లు ఉండగా అవన్నీ RRR రీ రిలీజ్ కి అమ్ముడు పోవడం విశేషం. అంతే కాకుండా ఇంకా ఆడియన్స్ టికెట్ల కోసం థియేటర్ బయట క్యూ లైన్స్ లో నిల్చున్నారు. ఆ థియేటర్ లో షో అయిపోయాక రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడాడు. దీంతో మరోసారి RRR సినిమా హాలీవుడ్ లో రచ్చ చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ తో పాటు డబ్బులు కూడా భారీగా వస్తున్నాయి.
Jeevitha Rajasekhar : గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న జీవిత రాజశేఖర్.. రజినీకాంత్ కి చెల్లెలుగా..
ఎలాగైనా RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావాలని ఇండియా మొత్తం కోరుకుంటుంది. ఇక ఆస్కార్ టార్గెట్ గా రాజమౌళి, RRR టీం అమెరికాలో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.
A 1647-seater venue is sold out in Los Angeles, USA on the 342nd day of #RRRMovie release. 🙏🏻🙏🏻🙏🏻
It's heartwarming to see the audience waiting in a long queue to get inside. ❤️❤️ @BeyondFest @am_cinematheque @VarianceFilms @sarigamacinemas pic.twitter.com/dBlw4eFaXA
— RRR Movie (@RRRMovie) March 2, 2023