Jeevitha Rajasekhar : గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న జీవిత రాజశేఖర్.. రజినీకాంత్ కి చెల్లెలుగా..

దాదాపు 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతుంది జీవిత. లైకా ప్రొడక్షన్ లో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో.................

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 08:56 AM

Jeevitha Rajasekhar : గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న జీవిత రాజశేఖర్.. రజినీకాంత్ కి చెల్లెలుగా..

Jeevitha Rajasekhar :  తెలుగు, తమిళ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ జీవిత ఆ తర్వాత రాజశేఖర్ ని వివాహం చేసుకోవడంతో సినిమాలు చెయ్యటం ఆపేసింది. అయితే హీరోయిన్ గా సినిమాలు ఆపేసినా దర్శకురాలిగా, నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించింది. 1990లో చివరిసారిగా రాజశేఖర్ ‘మగాడు’ సినిమాలో నటించింది జీవిత. ఆ తర్వాత ఏ సినిమాలోనూ మళ్ళీ కనిపించలేదు.

ఇప్పుడు దాదాపు 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతుంది జీవిత. లైకా ప్రొడక్షన్ లో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విక్రాంత్, విష్ణు విశాల్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా లాల్ సలాం. ఈ సినిమాలో రజినీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలిగా జీవిత నటించబోతుందని ప్రకటించారు.

KTR : ప్రభుత్వ పరంగా సినిమాకు చేయాల్సింది ఇంకా ఉంది.. కేటీఆర్ వ్యాఖ్యలు..

చాలా సంవత్సరాల తర్వాత జీవిత కంబ్యాక్ ఇవ్వడం, అది కూడా రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ తో రావడం పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై జీవిత మళ్ళీ వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.