KTR : ప్రభుత్వ పరంగా సినిమాకు చేయాల్సింది ఇంకా ఉంది.. కేటీఆర్ వ్యాఖ్యలు..

కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల దగ్గర ఈ సినిమా షూటింగ్ జరిగిందని విన్నాను. తెలంగాణ పల్లె సంసృతి, సాంప్రదాయాలు ఈ సినిమాలో చూపిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల................

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 08:33 AM

KTR : ప్రభుత్వ పరంగా సినిమాకు చేయాల్సింది ఇంకా ఉంది.. కేటీఆర్ వ్యాఖ్యలు..

KTR :  ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా బలగం. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ రిలీజయ్యాయి. తెలంగాణలోని ఓ పల్లె, అక్కడి మనుషులు, మానవ సంబంధాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Pawan Kalyan : పవర్ స్టార్ – సుప్రీం హీరో సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసా?

ఈ ఈవెంట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల దగ్గర ఈ సినిమా షూటింగ్ జరిగిందని విన్నాను. తెలంగాణ పల్లె సంసృతి, సాంప్రదాయాలు ఈ సినిమాలో చూపిస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల ప్రేక్షకులని కదిలిస్తుంది. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న సినారె, మిద్దె రాములన్న, ఈ సినిమాకి పని చేసిన మంగ్లీ, కాసర్ల శ్యామ్ అలాగే దర్శకుడు అనుదీప్ వీళ్ళందరూ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళే. వీళ్ళందర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది. డీజే టిల్లులో సిద్ధూ, జాతిరత్నాలు సినిమాలో నవీన్ తెలంగాణ యాసలో మాట్లాడారు. ఇటీవల చాలా మంది తెలంగాణ యాసలో మాట్లాడుతూ మన యాసకు గౌరవం తెస్తున్నారు. తెలంగాణ యాస మాట్లాడటానికి మొహమాటపడే రోజు నుంచి ఇవాళ సినిమాల్లో హీరోలు కూడా మాట్లాడే స్థాయికి ఎదిగామంటే కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వపరంగా సినిమాకు ఇంకా చేయాల్సి ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రితో మాట్లాడి సినిమాకు మరింత మంచి చేస్తాము అని అన్నారు.