Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా రనౌత్.. ఎలా చేస్తుందో??

Kaburulu

Kaburulu Desk

November 30, 2022 | 08:54 AM

Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా రనౌత్.. ఎలా చేస్తుందో??

Chandramukhi 2 :  రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక ముఖ్య పాత్రలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో జ్యోతిక అమాయక సాధారణ గృహిణి పాత్రతో పాటు, చంద్రముఖిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా చూసి భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళ దర్శకుడు వాసు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత ఇటీవల దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు.

చంద్రముఖి సీక్వెల్ లో ఈ సారి రజినీకాంత్ బదులు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. సీక్వెల్ సినిమాకి కూడా వాసునే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాకి ముఖ్య పాత్ర అయిన చంద్రముఖిని ఎవరు చేయనున్నారు అని అంతా ఆలోచించారు. తాజాగా ఎవరూ ఊహించనివిధంగా కంగనా రనౌత్ పేరు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖిలో నటిస్తున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేసింది కంగనా. మరో తమిళ సినిమాలో చేస్తున్నందుకు, వాసు గారి దర్శకత్వంలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేసే కంగనా చంద్రముఖి పాత్రకి ఎంతవరకు న్యాయం చేయగలదో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. చూడాలి మరి ఈ బాలీవుడ్ భామ చంద్రముఖిగా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో.