Murder Case: నవీన్ హత్యకేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు.. ఒక్కో పార్ట్ నరుకుతూ అమ్మాయికి వాట్సాప్!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 05:58 PM

Murder Case: నవీన్ హత్యకేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు.. ఒక్కో పార్ట్ నరుకుతూ అమ్మాయికి వాట్సాప్!

Murder Case: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న నవీన్ ను హత్య చేసింది ఇంటర్ క్లాస్ మెట్ హరిహర కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న నలగొండలో నవీన్ మిస్సింగ్ కేసు నమోదు కాగా.. ఫైనల్ గా అది మర్డర్ కేసుగా ముగిసింది. అయితే, తాజాగా అబ్దుల్లాపీర్‌మెట్‌ పీఎస్‌లో లొంగిపోయిన నిందితుడు హరిహరకృష్ణ హత్య గురించి సంచలన విషయాలను చెప్పాడు.

నిందితుడు హరిహరకృష్ణ ముసారాంబాగ్‌కు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు.. అతనిపై ఐపీసీ 302, 301 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిందితుడు హరిహరకృష్ణ సంచలన వాంగ్మూలం కూడా ఇవ్వగా.. ఏ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. కృష్ణ నవీన్‌ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ.. ఆ భాగాల ఫోటోలను పంపిన మెసేజ్‌లకు అమ్మాయి ‘గుడ్ బాయ్’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.

ముందుగా నవీన్‌ని హత్య చేశాక కృష్ణ ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత మెసేజ్‌లో కూడా నవీన్ హత్య విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో భాగం కోస్తూ.. ఆమెకు ఫోటోలు పంపాడు. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు, ఈ పెదాలే కదా నిన్ను ముద్దు పెట్టుకుంది.. అంటూ పెదాలు, ఈ గుండె కదా నిన్ను తాకింది అంటూ గుండెను కోసి.. చివరకు నవీన్ తలని, నవీన్ మర్మాంగాన్ని కూడా కోశాడు.

అలా, ఒక్కో భాగం కోస్తూ.. ఒక్కో ఫోటోను అమ్మాయికి వాట్సాప్ చేస్తూ చాలా దారుణంగా మెసేజ్ పంపించినట్లు తేలింది. దానికి ఆ అమ్మాయి కూడా ఏమాత్రం భయపడకుండా సింపుల్‌గా.. ‘అవునా, ఓకే వెరీ గుడ్ బాయ్’ అంటూ సమాధానం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో అమ్మాయిని కూడా అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు.