Naveen murder case: హరిహర కృష్ణకి షెల్టర్ ఇచ్చిన స్నేహితుడు స్టేట్మెంట్ లో విస్తుపోయే నిజాలు!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 08:57 PM

Naveen murder case: హరిహర కృష్ణకి షెల్టర్ ఇచ్చిన స్నేహితుడు స్టేట్మెంట్ లో విస్తుపోయే నిజాలు!

Naveen murder case: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నవీన్‌ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్నేహితుడు హరిహర కృష్ణ అతి కిరాతకంగా చేసిన ఈ హత్యకేసులో రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నవీన్ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపగా.. మూడునెలల ముందే నవీన్‌ హత్యకు హరి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మలక్‌పేట్‌ సూపర్‌ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేసి.. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌ను హత్య చేశాడు.

హత్యకు ముందు పెద్ద అంబర్‌పేట్‌ వైన్స్‌లో హరి, నవీన్‌ ఇద్దరూ కలిసి మద్యం సేవించగా.. మత్తులో యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి.. ఓఆర్ఆర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో నవీన్‌ను గొంతు నులిమి హరి హత్య చేసి.. ఆ తర్వాత కత్తితో శరీరాన్ని విడి భాగాలుగా చేసి బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్‌ హసన్‌ ఇంటికి వెళ్లిన హరి.. నవీన్ హత్య విషయం ‎ఫ్రెండ్‌కు చెప్పాడు.

హత్య అనంతరం షల్టర్ ఇచ్చిన అసన్ విస్తుపోయే విషయాలను వెల్లడించారు. మృతుడు నవీన్ కి గంజాయి అలవాటు ఉందని.. హరిహర కృష్ణకు కేవలం మద్యం సేవించే అలవాటు ఉందని.. కళాశాలలో ఉన్నప్పుడు హరిహర కృష్ణ మంచివాడిగానే ఉండేవాడని.. కేవలం అమ్మాయి కోసమే మర్డర్ చేశాడని అసన్ తెలిపాడు. తనకి రాత్రి 12 గంటల 20 నిమిషాలకు హరిహర కృష్ణ ఫోన్ చేసి తన ఇంటి వద్దకు వచ్చానని బయటకు రావాలని కోరాడని చెప్పాడు.

బయటకి వెళ్లిన తనకు మర్డర్ గురించి, బాడీ పార్ట్స్ ను పడేసి వచ్చానని.. తనకు ఒక డ్రెస్ కావాలని అడగడంతో తన డ్రెస్ ఇచ్చానని అది వేసుకొని తెల్లవారు జామున 4 గంటలకి తూర్క యంజల్ మీదుగా హస్తినాపురం వెళ్లి ప్రేయసిని కలిసినట్టు అసన్ తెలిపాడు. అప్పటినుండి నాకు టచ్ లో లేరని అతని లొంగిపోయిన అనంతరం వరుసటి రోజు పోలీసులు మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారని అసన్ తెలిపాడు.