CM Jagan: తాడేపల్లి నుండి తెనాలికి 28 కిమీకి జగన్ ఫ్లైట్ జర్నీ.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 08:45 PM

CM Jagan: తాడేపల్లి నుండి తెనాలికి 28 కిమీకి జగన్ ఫ్లైట్ జర్నీ.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

CM Jagan: ` ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్లారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్లారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తాడేపల్లి నుండి తెనాలికి హెలికాఫ్టర్ లో వెళ్లిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై భరోసా బటన్ నొక్కారు. రైతు భరోసా కూడా కేంద్రం పీఎం కిసాన్ తో లింక్ అయి ఉండడం.. ఒక చిన్న విషయానికి.. అది కూడా కూతవేటు దూరంలో ఉన్న తెనాలికి ఫ్లైట్ లో వెళ్లడం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆసరాగా మారింది.

కేవలం 28 కిమీకి ఫ్లైట్ వాడిన దేశంలోనే నెంబర్ 1 సీఎంగా జగన్మో హన్ రెడ్డి నిలిచిపోతారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఈ వేదిక నుండే సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేస్తూ చంద్రబాబు, పవన్ కు ఛాలెంజ్ విసిరారు. వేర్వేరుగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా? అంటూ సవాల్ చేశారు. దీనిపై స్పందించిన జనసేన నేత నాదెళ్ల మనోహర్ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసే దమ్ము, పోరాడే దమ్ము జనసేనకు ఉందో లేదో ఎన్నికల వేళ అది చూసుకుందాం. ముం దు ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ సభల్లో ఎలా మాట్లాడాలో, రాజకీయ ఉపన్యాసాలెందుకు ఇవ్వకూడదో ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఇంట్లోవాళ్లే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ముందే ప్రధాని జమ చేసిన నిధులకు మీ హడావుడి ఎందుకు? నిన్న కర్ణాటక టూర్ లో ఉన్న ప్రధాని పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే, మళ్లీ అవే డబ్బులకు సీఎం ప్రత్యేక విమానంలో వెళ్లి బటన్ నొక్కడం దేనికని ప్రశ్నించారు.

తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ప్రయాణం చేసిన ధనిక ముఖ్యమంత్రి క్లాస్ వార్ అంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. సీఎం సభలో చప్పట్లు ఎప్పుడు కొట్టాలి? ఈలలు ఎప్పుడు వేయాలో కూడా శిక్షణ ఇచ్చి సభకు తీసుకెళ్లారని.. టార్గెట్లు పెట్టి, బెదిరించి జనాన్ని తీసుకొచ్చారని.. తెనాలిలో కరెంటు కట్ చేసి, ఆస్పత్రిలో జనం చనిపోయేలా చేసారని.. ఇవన్నీ చేసి సభలు పెట్టుకొని, మీ జబ్బలు మీరే చరుచుకోవడమే మీ నైజం అని మనోహర్ ఎద్దేవా చేశారు.