Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

Kaburulu

Kaburulu Desk

March 9, 2023 | 09:36 PM

Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

Wine Shops Close: పాపం మందు బాబులు.. పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం ఇలా చాలా దినాలలో వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా, ఎలాంటి పండగలు లేకపోయినా మూడు రోజుల పాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నెల 13న జరగనున్న ఉత్తర కోస్తా ఆంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న కోస్తాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాల్లోని మద్యం దుకాణలు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం డిపోలతో పాటు స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నేవీ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.