ఒక చేత్తో గొడుగు, మరో చేత్తో స్టీరింగ్ .. వీడియో వైరల్

మనం నిత్యం ప్రయాణం చేసే సాధనాల్లో బస్సు కూడా ముఖ్యమైనదే. క్షేమంగా మనల్ని గమ్యస్థానాల్ని చేర్చే వాహనం. ఉదయం లేచిన దగ్గర నుండి స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారస్తులు, ఉద్యోగులు.. ఇలా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినచో వారు ఎక్కువగా డబ్బులు లాగుతుంటారు.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:08 PM

ఒక చేత్తో గొడుగు, మరో చేత్తో స్టీరింగ్ .. వీడియో వైరల్

మనం నిత్యం ప్రయాణం చేసే సాధనాల్లో బస్సు కూడా ముఖ్యమైనదే. క్షేమంగా మనల్ని గమ్యస్థానాల్ని చేర్చే వాహనం. ఉదయం లేచిన దగ్గర నుండి స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారస్తులు, ఉద్యోగులు.. ఇలా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినచో వారు ఎక్కువగా డబ్బులు లాగుతుంటారు. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికులను ఆకర్షించుటకు అనేక రకాలుగా ఆఫర్లు పెడుతున్నారు. అందుకే సుఖమయ ప్రయాణం కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీనే చాలా మంది నమ్ముకుంటారు. అయితే కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సరైన సదుపాయాలు లేక సిబ్బంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు కారణం అయింది. ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గొడుగు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ విడువకుండా వర్షాలు పడుతున్నాయి. సరిగ్గా డ్రైవర్ కూర్చున్న సీట్ పై కురుస్తుండడంతో అతను గొడుగుతో డ్రైవింగ్ చేస్తున్నాడు. విరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భారీగా వర్షాలు పడుతుండడంతో బస్సు పై భాగంలో చిల్లు ఉండి దానిగుండా వాన నీరు డ్రైవరుపై పడుతుంది. దీంతో అతను ఓ చేత్తే గొడుగు పట్టుకుని ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాడు. తాను కూడా గొడుగు పట్టుకున్నందుకు తడవకుండా డ్రైవింగ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ ప్యాసెంజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.