Shree Karthick : అయిదేళ్ళు వెయిట్ చేసినా పర్లేదు.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..

Kaburulu

Kaburulu Desk

September 14, 2022 | 10:58 AM

Shree Karthick : అయిదేళ్ళు వెయిట్ చేసినా పర్లేదు.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..

Shree Karthick :  శర్వానంద్ హీరోగా, అమల ముఖ్యపాత్రలో తెరెక్కిన ‘ఒకేఒక జీవితం’ సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం అందుకుంది. టైం ట్రావెల్ కాన్సప్ట్ కి అమ్మ సెంటిమెంట్ ని జోడించి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకొని దర్శకుడిని అభినందిస్తున్నారు.

తమిళ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లని తెరకెక్కించిన శ్రీ కార్తీక్ ఒకేఒక జీవితం సినిమాతో తెలుగు, తమిళ్ లో ఒకేసారి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా ఇచ్చిన సక్సెస్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు శ్రీ కార్తీక్.

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

శ్రీ కార్తీక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా తెలుగులోనే ఉంటుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. నాకు, మా ఫ్యామిలిలో అందరికీ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర ఒక ఫాంటసీ కథ ఉంది. అది అల్లుఅర్జున్ తోనే చేయాలనుకుంటున్నాను. ఆయనకి ఆ కథని వినిపించాలి. ఒక అయిదు సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చినా పర్లేదు, అల్లుఅర్జున్ తో మాత్రం సినిమా చేస్తాను” అని అన్నారు. మరి బన్నీ ఈ దర్శకుడికి అవకాశం ఇస్తాడా చూడాలి.