Sharwanand : నిశితార్థం చేసుకున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరో తెలుసా??

గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నా దానిపై శర్వా అధికారికంగా ఇన్నాళ్లు స్పందించలేదు. రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి తనకి కాబోయే భార్యని అందరికి పరిచయం చేశాడు. తన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి..............

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 06:42 AM

Sharwanand : నిశితార్థం చేసుకున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరో తెలుసా??

Sharwanand :  టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ తాజాగా నిశ్చితార్థం చేసుకొని అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి సైడ్ హీరో నుంచి హీరోగా ఎదిగిన శర్వానంద్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు సినిమాలని తీసుకొస్తున్నాడు. ఇటీవలే ఒకేఒక జీవితం సినిమాతో మంచి విజయం సాధించాడు. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఇప్పట్లో పెళ్లి చేసుకోను, ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటాను అని చెప్పాడు. కానీ జనవరి 26న నిశ్చితార్థం చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.

గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నా దానిపై శర్వా అధికారికంగా ఇన్నాళ్లు స్పందించలేదు. రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి తనకి కాబోయే భార్యని అందరికి పరిచయం చేశాడు. తన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి.. ఈ బ్యూటిఫుల్ అమ్మాయి రక్షితతో కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్నాను, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని పోస్ట్ చేశాడు.

Michael Trailer : మైఖేల్ ట్రైలర్ రిలీజ్.. సందీప్ కిషన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా..

కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్ నిశ్చితార్థం రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో జరిగింది. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది. రక్షిత మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది. అలాగే హైకోర్టు న్యాయమూర్తి మధుసూదనా రెడ్డి కూతురు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, అల్లరి నరేష్, సాయి రామ్ శంకర్, దిల్ రాజు ఫ్యామిలీలతో పాల్గొన్నారు. అలాగే తరుణ్, వడ్డే నవీన్, శ్రీకాంత్, రానా, గౌతమ్, సిద్దార్థ్, అదిరిరావు హైదరి.. మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కొత్త జంటకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.