Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా..

Kaburulu

Kaburulu Desk

September 14, 2022 | 11:09 AM

Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా..

Prabhas :  ఇటీవల బీజేపీ నేతలు తెలుగు సినీ పరిశ్రమ మీద బాగా ఫోకస్ చేశారు. టాలీవుడ్ హీరోలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఎన్టీఆర్, నితిన్ ని మీట్ అవ్వగా త్వరలో నిఖిల్ ని కూడా కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, దేశ హోంమంత్రి అమిత్ షా ప్రభాస్ ని కలవనున్నట్టు తెలుస్తుంది.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ హైదరాబాద్ లో భారీగా నిర్వహించబోతోంది. దీనికి ముఖ్య అతిధిగా రానున్న అమిత్ షా ఒకరోజు ముందే సెప్టెంబర్ 16న వచ్చి బీజేపీ నేతలతో సమావేశం అవ్వనున్నారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు బీజేపీలో ఒకప్పుడు అగ్రనేతగా ఉన్నారు. గతంలో వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. సెప్టెంబర్ 16నే కృష్ణంరాజు గారి సంస్మరణ సభ నిర్వహిస్తుండటంతో అమిత్ షా ఆ రోజే వెళ్లి ప్రభాస్ ని పరామర్శించనున్నట్టు సమాచారం.

Tollywood Celebrities Console Prabhas : కృష్ణంరాజుకు నివాళులు.. ప్రభాస్ కి పరామర్శ.. గ్యాలరీ..

అమిత్ షా-ప్రభాస్ సమావేశం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కేవలం కృష్ణంరాజు బీజేపీ నేత కావడం వల్ల ఆయనకు నివాళులు అర్పించి, ప్రభాస్ ని పరామర్శించడానికే అమిత్ షా ప్రభాస్ ని కలవటానికి వెళ్తున్నట్టు సమాచారం.