SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

Kaburulu

Kaburulu Desk

September 13, 2022 | 01:14 PM

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా స్టోరీలైన్ ఇదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో చెప్పేసిన రాజమౌళి..

SSMB29 : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని RRR సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచారు. RRR సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, నెటిజన్లు, టెక్నీషియన్స్ అంతా రాజమౌళి దర్శకత్వాన్ని అభినందించారు.

RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళితో చేయనున్నారు. SSMB29 సినిమాని రాజమౌళి ఎలా తెరకెక్కిస్తారు, మహేష్ ని ఎలా చూపిస్తారు అని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా రాజమౌళి మహేష్ సినిమా స్టోరీ లైన్ గురించి చెప్పారు.

Mahesh Babu : బుల్లితెరపై మహేష్,సితార.. స్టెప్పులేసిన సితార.. డ్యాన్సర్లకి ఛాన్స్ ఇచ్చిన మహేష్..

ప్రస్తుతం రాజమౌళి కెనడాలోని టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ఉన్నారు. అక్కడ రాజమౌళి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన చర్చల్లో రాజమౌళి మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ.. ”నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నాను. ఇదొక గ్లోబల్ ట్రావెల్ అడ్వెంచర్ మూవీగా ఉండబోతుంది” అని తెలిపారు. దీంతో ఈ సినిమా ప్రపంచ దేశాల్లో తిరుగుతూ మహేష్ సాహసాలు చేస్తాడు అని తెలుస్తుంది. మహేష్ అభిమానులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడెప్పుడు తమ హీరో రాజమౌళితో పనిచేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.