Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Kaburulu

Kaburulu Desk

September 14, 2022 | 11:23 AM

Bandla Ganesh : మా హీరోని చూసి నేర్చుకోండి.. యువ హీరోలకి బండ్లన్న క్లాస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Bandla Ganesh :  సినీ నటుడు, నిర్మాత బండ్ల్ గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి అభిమానో అందరికి తెలిసిందే. ఎప్పుడు స్టేజి ఎక్కినా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ మాట్లాడతారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి కౌంటర్లు వేస్తాడు. ఇక తన ట్విట్టర్లో అయితే పవన్ కి సంబంధించిన పోస్టులు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన హీరోని ప్రతిసారి పైకి లేపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు.

ఈ విషయంలో తాజాగా బండ్లగణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. అప్పుడప్పుడు బండ్లన్న వివాదాస్పద ట్వీట్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఆ ట్వీట్స్ కి నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేస్తారు. తాజాగా యువ హీరోలని, పవన్ ని చూసి నేర్చుకోండి అంటూ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవ్వగా నెటిజన్లు బండ్లన్నని ట్రోల్ చేస్తున్నారు.

మంగళవారం రాత్రి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి యువ హీరోలు అడివిశేష్, నాగచైతన్య, సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా వచ్చారు. అయితే ఈవెంట్లో అంతా సరదాగా ఉంది, సరదాగా కూర్చున్నారు. ఈ యువ హీరోలు తాము కూర్చున్న సీట్స్ పెద్దగా ఉండటం, పక్కన పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో కాళ్ళు పైకి పెట్టుకొని, కాలు మీద కాలు వేసుకొని కంఫర్ట్ గా కూర్చున్నారు.

Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా..

దీంతో బండ్లగణేష్ వాళ్ళు అలా కూర్చున్న ఫోటోని, గతంలో పవన్ సినీ ఫంక్షన్స్ లో పద్దతిగా కూర్చున్న ఫోటోలని షేర్ చేసి.. ”నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం” అంటూ పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్లు వాళ్ళు ఎలా కూర్చోవాలో కూడా నువ్వే చెప్తావా, వాళ్ళు కంఫర్ట్ గా కూర్చుంటే అక్కడ ఉన్నవాళ్ళకి లేని ప్రాబ్లమ్ నీకెందుకు, మీ హీరోని పైకి లేపడానికి వేరే హీరోలని తక్కువ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తూ బండ్ల గణేష్ ని ట్రోల్ చేస్తున్నారు.

ఈ వివాదం పెద్దదవడం, నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ తర్వాత ట్వీట్ ని డిలీట్ చేశాడు బండ్ల గణేష్. మరి దీనిపై ఆ యువ హీరోలు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.