Mahesh Babu : బుల్లితెరపై మహేష్,సితార.. స్టెప్పులేసిన సితార.. డ్యాన్సర్లకి ఛాన్స్ ఇచ్చిన మహేష్..

Kaburulu

Kaburulu Desk

August 30, 2022 | 12:58 PM

Mahesh Babu : బుల్లితెరపై మహేష్,సితార.. స్టెప్పులేసిన సితార.. డ్యాన్సర్లకి ఛాన్స్ ఇచ్చిన మహేష్..

 

Mahesh Babu :  సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తుంటారు. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళు టీవీ షోలలో జడ్జీలుగా, గెస్టులుగానో వస్తూనే ఉన్నారు. ఇక స్టార్ హీరోలైతే ఎప్పుడో ఒకసారి స్పెషల్ ఎపిసోడ్స్ లో అలా కనిపిస్తూ అలరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో కొన్ని టీవీ షోలలో కనపడి బుల్లితెర ప్రేక్షకులని అలరించారు. అయితే ఈ సారి మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి ఓ టీవీ షోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇటీవలే స్టార్ట్ అయిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఓ షోలో మహేష్, సితార స్పెషల్ గెస్టులుగా వచ్చారు. తాజాగా ఈ షో నుంచి మహేష్, సితారల ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో వీరిద్దరికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక సితార డ్యాన్సర్లతో సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ కి స్టెప్పులేసింది. దీంతో మహేష్ తన కూతుర్ని చూసి మురిసిపోతూ చాలా ఆనందపడిపోయాడు. ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు మహేష్. సూపర్ స్టార్ అందం గురించి తెలిసిందే. ఈ ప్రోమోలో అయితే మహేష్ మరింత అందంగా కనిపించాడు.

ఫ్యాన్స్ ఈ సర్‌ప్రయిజ్ ప్రోమోని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. సితార మొదటిసారి టెలివిజన్ లోకి రావడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇద్దరు డ్యాన్సర్లు అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో వాళ్ళకి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తా అని తెలిపాడు మహేష్. దీంతో ఆ డ్యాన్సర్లు మహేష్ కాళ్ళకి దండం పెట్టగా వారిని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 4 ఆదివారం నాడు టెలికాస్ట్ అవ్వనుంది.