Vijay Sethupathi : వామ్మో విలన్ గా పారితోషికం అన్ని కోట్లా.. షారుఖ్ కి విలన్ గా సౌత్ స్టార్..

Kaburulu

Kaburulu Desk

August 30, 2022 | 12:21 PM

Vijay Sethupathi : వామ్మో విలన్ గా పారితోషికం అన్ని కోట్లా.. షారుఖ్ కి విలన్ గా సౌత్ స్టార్..

Vijay Sethupathi :  అన్ని పరిశ్రమలలో ఇప్పుడున్న పెద్ద సమస్య ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్. ఒకపక్క అవి ఎక్కువవుతున్నాయి అంటూనే మరో పక్క స్టార్ ఆర్టిస్టులు అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. హీరోలకే బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులకి బాగానే వెళ్తుంది. ఈ మధ్య విలన్స్ కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇటీవల విలన్ గా కూడా చేస్తున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

హీరోగా ఎన్ని సినిమాలు చేసినా తన నటన చూపించాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా విలన్ గా బెటర్ అని ఫిక్స్ అయి వరుసగా ఇటీవల విలన్ క్యారెక్టర్స్ వేస్తున్నారు. అయితే విజయ్ సేతుపతి చూపించిన కొత్త విలనిజానికి సినీ వర్గాలు ఫిదా అయిపోయి మాకు విలన్ గా విజయ్ సేతుపతే కావాలని అంటున్నారు. ఉప్పెన, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో తన సరికొత్త విలనిజంతో సూపర్ అనిపించుకున్నాడు. ఇక విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్ తో అదరగొట్టేశాడు. ఇన్నాళ్లు సౌత్ కి తన విలనిజం చూపించిన విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళకి కూడా తన నట విశ్వరూపం రుచి చూపిద్దామని ఫిక్స్ అయ్యాడు.

బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా జవాన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత జవాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో షారుఖ్ కి విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సాధారణంగా సౌత్ లో ఒక్కో సినిమాకి 5 నుంచి 8 కోట్లు తీసుకునే విజయ్ సేతుపతి ఇటీవల విక్రమ్ సినిమా హిట్ అయిన తర్వాత రెమ్యునరేషన్ 10 కోట్ల వరకు పెంచినట్టు సమాచారం.

ఇప్పుడు బాలీవుడ్ లో జవాన్ సినిమాకి విజయ్ సేతుపతి ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుసు కానీ విలన్ క్యారెక్టర్ కి మరీ 20 కోట్లు ఇస్తున్నారా అని అంతా షాక్ అవుతున్నారు. అయితే విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. సేతుపతి తాను తీసుకునే రెమ్యునరేషన్ కి కచ్చితంగా న్యాయం చేసి షారుఖ్ కి సినిమాలో గట్టి పోటీ ఇచ్చి బాలీవుడ్ కి కూడా తన సరికొత్త విలనిజాన్ని పరిచయం చేస్తాడని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు జవాన్ సినిమా కోసం షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.