SSMB28 : SSMB28 రిజల్ట్ చెప్పిన నెటిజెన్.. కౌంటర్ ఇచ్చిన నిర్మాత!

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'SSMB28'. ఈ మూవీ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. ఈ మూవీ స్టోరీ మారింది అంటూ, హీరోయిన్ మారింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించగా.. వాటికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తాజాగా ఒక నెటిజెన్ మూవీ పై చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ రీ ట్వీట్ చేశాడు.

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 07:17 PM

SSMB28 : SSMB28 రిజల్ట్ చెప్పిన నెటిజెన్.. కౌంటర్ ఇచ్చిన నిర్మాత!

SSMB28 : మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘SSMB28’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు, ఖలేజా వంటి సినిమాలు తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం ఇది. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ మధ్యలో చాలా బ్రేక్ తీసుకోని ఇటీవలే మళ్ళీ సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. కాగా ఈ మూవీ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది.

SSMB28 : మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య రాయ్?

ఈ మూవీ స్టోరీ మారింది అంటూ, హీరోయిన్ మారింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించగా.. వాటికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తాజాగా ఒక నెటిజెన్ మూవీ పై చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ రీ ట్వీట్ చేశాడు. ‘బ్రహ్మోత్సవం ఎంత పెద్ద రాడ్. దాని తర్వాత వచ్చిన స్పైడర్ ఇంకో రాడ్. ఇలా వరస రాడ్ లు ఇచ్చిన హీరో. నెక్స్ట్ వరసగా 6 మూవీస్ డీసెంట్ హిట్ ఇస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు’ అని ట్వీట్ చేస్తూ SSMB28 కూడా డీసెంట్ హిట్ అన్ని డిసైడ్ చేశాడు. దానికి నాగవంశీ అదిరిపోయే రియాక్ట్ అయ్యాడు.

‘ప్రొడక్షన్ లో ఉన్న సినిమా రిజల్ట్ ఏంటో కూడా మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు. SSMB28 డీసెంట్ హిట్ అవుతుంది అని చెప్పిన నువ్వు.. వచ్చే వరల్డ్ కప్ రిజల్ట్ కూడా చెప్పవచ్చు కదా?’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇక నాగవంశీ ట్వీట్ చూసిన కొందరు మహేష్ అభిమానులు.. ఇది కేవలం డీసెంట్ హిట్టు కాదు. అంతకుమించి ఉండబోతుంది అని నాగవంశీ చెప్పాడు అంటూ కామెంట్లు చేస్తున్నాడు. కాగా ఏ సినిమాలో మహేష్ బాబుకి జంటగా శ్రీలీల, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.