SSMB28 : మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య రాయ్?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'SSMB28'. ఈ మూవీ గురించి ఒక గాసిప్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 07:37 PM

SSMB28 : మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య రాయ్?

SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం ‘SSMB28’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు మంచి ప్రజాధారణ పొందాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో.. ఇప్పుడు ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ మొన్నటి వరకు మొదలు కాకపోవడంతో.. ఈ చిత్రంపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకున్నాక కూడా అనేక రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీ స్టోరీ మారింది అని. మొదటి షెడ్యూల్ లో తీసిన సీన్స్ అన్ని స్క్రాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

SSMB28 : SSMB28 షూటింగ్ సెట్ లీక్.. మెట్రో నుంచి వీడియో రికార్డింగ్..

అయితే మూవీ టీం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఒక గాసిప్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉన్నదో తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు అందమైన భామలు మహేష్ బాబు సరసన కనిపించబోతున్నారు.

శ్రీలీల, పూజా హెగ్డే ఇద్దరు మహేష్ బాబుతో ఈక్వల్ స్క్రీన్ షేర్ చేసుకుంటారు అంటూ నిర్మాత నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో నటించే ఇతర నటీనటులు గురించి తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోలో జరుగుతుంది.