Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘OG’ కథని దర్శకుడు మొదట మహేష్ బాబు వినిపించాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'OG' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 08:05 PM

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘OG’ కథని దర్శకుడు మొదట మహేష్ బాబు వినిపించాడా?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. సినిమాలు వదిలి రాజకీయాలు వైపు వెళ్లడంతో కొన్నాళ్ళు అభిమానులకు దూరం అయ్యాడు. ఇక రీ ఎంట్రీ తరువాత మూవీ విషయాల్లో వేగం పెంచేశాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’ మొదలు పెట్టబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే దీని పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Pawan Kalyan : సింగల్ షెడ్యూల్‌లో సినిమా కంప్లీట్ చేయబోతున్న పవన్, సుజిత్?

ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నాయి అనే దాని మీద క్లారిటీ లేదు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘OG’ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీ స్టోరీని సుజిత్ మొదటిగా మహేష్ బాబుకి వినిపించాడట. మహేష్ కి కూడా కథ బాగా నచ్చింది. కానీ SSMB28 షూటింగ్ లేటు అవ్వడం, తరువాత రాజమౌళితో ఒక సినిమా ఒప్పుకోవడంతో లేటు అవుతుంది అంటూ డైరెక్టర్ ఛాయస్ కి వదేలేశాడు అని సమాచారం.

రాజమౌళి సినిమా అంటే సుమారు 2-3 ఏళ్ళు పక్కా అని సుజిత్ పవన్ కళ్యాణ్ కి షిఫ్ట్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ షూటింగ్ మొత్తం ఒక షెడ్యూల్ లో పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. RRR నిర్మించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మూవీలో నటించే ఇతర నటీనటులు గురించి త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.