Periods Pain : పీరియడ్స్ లో నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు

Kaburulu

Kaburulu Desk

December 2, 2022 | 06:37 PM

Periods Pain : పీరియడ్స్ లో నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు

Periods Pain :  అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఎప్పుడూ ప్రతి నెల నొప్పిని భరిస్తూనే ఉంటారు. కొంతమందికి కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, కొంతమందికి నడుం నొప్పి, తలనొప్పి ఇలా ఒక్కొక్కరికి వివిధ నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనం రాకుండా నివారించలేము కానీ మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే నొప్పులను తగ్గించుకోవచ్చు.

ఆకుపచ్చని కూరగాయల్లో క్యాల్షియం, మెగ్నీసియం అధికంగా ఉంటాయి. బచ్చలికూర, క్యాలీఫ్లవర్, క్యాబేజి, ఆకుకూరలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటే పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు. డీహైడ్రేషన్ వలన తలనొప్పి వస్తుంది కాబట్టి పీరియడ్స్ సమయంలో నీరు తగినంత తాగేలా చూసుకోవాలి.

Hug : మనసారా హగ్ చేసుకోండి.. చాలా లాభాలు ఉన్నాయి..

మీరు నాన్వెజ్ తినేవారు ఐతే పీరియడ్స్ సమయంలో చేపలు తినవచ్చు. చేపలలో ఐరన్, ఒమేగా త్రీ, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగు ఖచ్చితంగా తినాలి అది మనకు వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి యోనిని కాపాడుతుంది. అమ్మాయిలు పెరుగు, ఆకుకూరలు, పసుపు, చేపలు తినడం వలన నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు.