Winter Food : చలికాలంలో ఆరోగ్యానికి.. ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..

Kaburulu

Kaburulu Desk

November 23, 2022 | 11:38 AM

Winter Food : చలికాలంలో ఆరోగ్యానికి.. ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..

Winter Food :  చలికాలం రాగానే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చలికాలంలో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. దీని వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, చలికాలంలో మన శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలను తినాలి. మన ఆహార విధానాలను కాలానుగుణంగా మార్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

చలికాలంలో ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో వీటిని భాగం చేసుకోండి..

*రోజూ ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవాలి, లేదా అన్నంలో కలుపుకొని తినాలి. ఇది మన శరీరానికి వేడిని ఇస్తుంది.
*ఒక స్పూన్ తేనెలో కొద్దిగా నల్ల మిరియాల పొడిని కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
*ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. చలికాలంలోనే ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
*వేరుశనగపప్పులు లేదా నువ్వులు బెల్లంతో కలిపి తింటే చలికాలంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
*వేడివేడి అన్నంలో ఒక పచ్చి వెల్లుల్లిని కలుపుకొని తింటే అది మనకు గుండె ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
*చక్కర బదులు బెల్లం వాడితే శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.
*నెయ్యి, గోధుమపిండి, బెల్లంతో చేసిన లడ్డూలను కూడా తినవచ్చు. ఇవి కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
*ఆకుకూరలు, బీన్స్ లాంటివి కూడా చలికాలంలో మంచి చేస్తాయి.