Hug : మనసారా హగ్ చేసుకోండి.. చాలా లాభాలు ఉన్నాయి..

Kaburulu

Kaburulu Desk

December 2, 2022 | 06:30 PM

Hug : మనసారా హగ్ చేసుకోండి.. చాలా లాభాలు ఉన్నాయి..

Hug : అందరూ తమ ప్రేమను అవతలి వారికి తెలియపరచడానికి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, ఫ్లవర్స్ ఇవ్వడం, తమ మాటలను కవితలుగా చెప్పడం, హగ్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. వీటన్నింటిలో కూడా హగ్ చేసుకోవడం వలన ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. హగ్ అనేది కేవలం లవర్స్, భార్య భర్తల మధ్యే కాదు అన్ని బంధాల్లోనూ ఉంటుంది. ప్రేమగా మన పేరెంట్స్ కి, సోదరి, సోదరులకు, పిల్లలకు కూడా ఇస్తాము.

అయితే ఒక సర్వే ప్రకారం రోజూ మనం ఎన్ని సార్లు హగ్ చేసుకోవాలో చెప్పారు. మనం రోజుకు కనీసం 4 సార్లు అయినా హగ్ చేసుకోవాలి. మనం ఆనందంగా బాగుండడానికి రోజుకి 8 హగ్స్ అవసరం అంట. ఇక మనం అభివృద్ధిలోనికి రావడానికి రోజుకి 12 హగ్స్ అవసరం అంట. ఈ విధంగా మనం హగ్ చేసుకుంటే మన మనసుకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

తులసి ఆకులు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

ఎవరైనా బాధలో ఉన్నట్లైతే వారు అవతలి వారికి ఆ బాధను చెప్పుకుంటే మనసు ఎంత రిలాక్స్ గా ఉంటుందో అదేవిధంగా మనం బాధలో ఉన్నప్పుడు అవతలి వారిని హగ్ చేసుకున్నప్పుడు కూడా అంతే రిలాక్స్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏదయినా బాధలో ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా కూడా హగ్ చేసుకుంటే మనకు సాంత్వన లభిస్తుంది. కాబట్టి మన అనుకునే వాళ్ళని రోజూ ప్రేమగా ఒక్కసారన్నా హగ్ చేసుకోండి.