Jilebi : బయట దొరికే జిలేబి.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 2, 2022 | 06:49 PM

Jilebi : బయట దొరికే జిలేబి.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

Jilebi :  చాలా మంది స్వీట్స్ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జిలేబి స్వీట్ ని చాలా మంది ఇష్టంగానే తింటారు. జిలేబి స్వీట్ ఎక్కువగా సాధారణ స్వీట్ షాప్స్ లో దొరకదు. కొన్ని స్వీట్ షాప్స్ లో మాత్రమే జిలేబి ఉంటుంది. బయట హర్యానా జిలేబి అంటూ సపరేట్ షాప్స్ లేదా బండ్లు ఉంటాయి. కానీ బయట కొంటే వాళ్ళు ఏ నూనెని వాడతారో, ఎన్నిసార్లు వాడిన దానిని వాడతారో, పిండి మంచిదేనా కాదా అని మనకు రకరకాల డౌట్లు ఉంటాయి. జిలేబిని మనం ఇంట్లో చేసుకోలేమా అని కూడా అనుకుంటారు. కాబట్టి జిలేబిని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

జిలేబి తయారీకి కావాల్సిన పదార్థాలు..

* 1 కప్పు మైదా పిండి
* 1 కప్పు పంచదార
* 1 కప్పు పెరుగు
* కొద్దిగా శనగపిండి
* నూనె సరిపడా
* 4 కప్పుల నీళ్లు

మొదట ఒక గిన్నెలో మైదా పిండి, శనగపిండి, పెరుగును ఉండలు లేకుండా కలుపుకొని ఒక పావుగంటసేపు పక్కన పెట్టాలి. కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్ గాని కలుపుకుంటే అచ్చం మార్కెట్ లో దొరికే జిలేబిలాగానే కలర్ లో ఉంటాయి.

Salt : కూరల్లో ఉప్పు ఎక్కువైందా?? ఇలా చెయ్యండి చాలు..

అనంతరం స్టవ్ మీద గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి పాకం పట్టాలి. పాకానికి పంచదార బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇంకొక స్టవ్ మీద నూనెని కాగబెట్టాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక కోన్ లాగా తయారుచేసుకున్న కవర్ ను ఉపయోగించి జిలేబి షేప్ వచ్చేలా కాగిన నూనెలో వేసుకోవాలి. అలా నూనెలోంచి తీసిన తర్వాత వాటిని మనం పట్టిన పంచదార పాకంలో వేసి పూర్తిగా నాననివ్వాలి. కాసేపటి తర్వాత బయటకి తీస్తే మనకు నచ్చిన వేడి వేడి తియ్యని జిలెబీలు రెడీ.