After Pregnancy : ప్రసవం తరువాత ఆడవారిలో సహజంగా వచ్చే మార్పులు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
గర్భం ధరించినప్పుడు మహిళల శరీరంలో మార్పులో ఏవిధంగా జరుగుతాయో ప్రసవం తరువాత కూడా శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి..............

After Pregnancy : గర్భం ధరించినప్పుడు మహిళల శరీరంలో మార్పులో ఏవిధంగా జరుగుతాయో ప్రసవం తరువాత కూడా శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. ప్రసవం తరువాత జుట్టు రాలడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రసవం తరువాత మన శరీరంలో జరిగే హార్మోన్ల అసమతుల్యత, మానసికంగా ఒత్తిడికి గురవడం వలన ఎక్కువగా జుట్టు రాలడం జరుగుతుంది. ప్రసవం జరిగిన ఆరు నెలల తరువాత జుట్టు రాలడం తగ్గి మళ్ళీ మామూలుగా మారుతుంది.
ప్రసవం తరువాత ఒక నెల లేదా రెండు నెలల పాటు రక్తస్రావం అనేది జరుగుతుంది నార్మల్ డెలివరీ అయితే వారం రోజులు మాత్రమే రక్తస్రావం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రసవం తరువాత మిగిలిన వ్యర్థాలన్నీ మన శరీరం నుండి రక్తస్రావం రూపంలో బయటకు వస్తాయి. ఈ విధంగా మన గర్భసంచి అనేది శుభ్రపడుతుంది.
నార్మల్ డెలివరీ అయితే ప్రసవం తరువాత కొన్ని నెలల వరకు రక్తస్రావం జరుగదు. ప్రసవం తరువాత కూడా పొట్ట ఎత్తుగా ఉంటుంది ఇంకా స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉంటాయి. అయితే డాక్టర్ చెప్పే బెల్ట్ వాడడం వలన పొట్ట తగ్గుతుంది. ఇంకా డాక్టర్ ఇచ్చే కొన్ని సలహాలను పాటించి స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టుకోవచ్చు.
బిడ్డ జన్మించిన తరువాత మహిళల్లో వృక్షోజాలు పాలతో నిండిపోతాయి. పుట్టిన బిడ్డకు వెంటనే పాలు ఇవ్వాలి లేకపోతే పాలు వక్షోజాలలో నిలువ ఉండి గడ్డగా మారి నొప్పి, జ్వరం వస్తాయి. కాబట్టి పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం అనేది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎప్పుడైతే బిడ్డకు పాలు ఇవ్వడం మానేస్తారో అప్పుడు వక్షోజాలు మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి.
White Hair : ఈ పదార్థాలు తింటున్నారా? కచ్చితంగా తెల్లజుట్టు త్వరగా వచ్చేస్తుంది..
ప్రసవం తరువాత కూడా కాళ్ళ వాపు అనేది అదేవిధంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకు బరువు తగ్గుతుంటారు అదే సమయంలో కాళ్ళ వాపు కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రసవం తరువాత వచ్చే మార్పులకు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవి అన్నీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు, డాక్టర్ల సలహాలు పాటించడం వలన తరువాత తగ్గిపోతుంటాయి.