Food Based on Blood Group : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తినాలో, తినకూడదో తెలుసా..?

మన బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా ఎలాంటి ఫుడ్ తినాలో, తినకూడదో, ఏది మనకి మంచిదో, ఏది మంచిది కాదో చెప్తున్నారు డైటీషియన్స్. కొన్ని రీసెర్చ్ ల అనంతరం ఒక్కో బ్లడ్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఫుడ్స్ తినొచ్చు, కొన్ని ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు అని...........

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 11:58 AM

Food Based on Blood Group : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తినాలో, తినకూడదో తెలుసా..?

Food Based on Blood Group :  సినిమా రంగంలో ఉండే సెలెబ్రెటీలు వారు బరువు పెరగడానికి, తగ్గడానికి ఎలా కావాలంటే అలా ఫుడ్ డైట్, ఎక్సర్సైజస్ మార్చుకుంటారని మనకు తెలుసు. అది ఎలా అంటే ముఖ్యంగా వారి బ్లడ్ గ్రూప్స్ ఆధారంగా వారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరుగుతారు లేదా తగ్గుతారు అనేది చెబుతారు. కొంతమంది ఒక రకమైన ఫుడ్ డైట్ ఫాలో అవ్వడం వలన బరువు తగ్గుతారు, కొంతమంది ఎటువంటి మార్పు చెందరు కాబట్టి వారి బ్లడ్ గ్రూప్ ను బట్టి ఫుడ్ డైట్ అనేది ఉంటుంది.

మన బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా ఎలాంటి ఫుడ్ తినాలో, తినకూడదో, ఏది మనకి మంచిదో, ఏది మంచిది కాదో చెప్తున్నారు డైటీషియన్స్. కొన్ని రీసెర్చ్ ల అనంతరం ఒక్కో బ్లడ్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఫుడ్స్ తినొచ్చు, కొన్ని ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు అని కనుక్కున్నారు.

బ్లడ్ గ్రూప్ ” O ”

ఈ బ్లడ్ గ్రూప్ వారు అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సీఫుడ్, ఉప్పు, రెడ్ మీట్, కాలె, కెల్ప్, బచ్చలికూర, బ్రొకలీ, చేపలు, కూరగాయలు, పండ్లు వంటివి తినాలి. గోధుమలు, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్, నేవీ బీన్స్, కాయధాన్యాలు, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్ లాంటివి ఎక్కువగా తినకూడదు.

బ్లడ్ గ్రూప్ ” A ”

ఈ బ్లడ్ గ్రూప్ వారు తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తినాలి. కూరగాయలు, టోఫు, సీఫుడ్, ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు, సోయా, పైనాపిల్ వంటి ఆహార పదార్థాలు తినడం బ్లడ్ గ్రూప్ A వారికి ఆరోగ్యపరంగా మంచిది. మాంసం, పాల ఉత్పత్తులు, కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, గోధుమలు వంటివి ఎక్కువగా తినకూడదు.

బ్లడ్ గ్రూప్ ” B ”

ఈ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది. మాంసం(కోడి తప్ప), పాల ఉత్పత్తులు, ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు, పండ్లు, ఆకుకూరలు, గుడ్లు వంటివి తింటే మంచిది. మొక్కజొన్న, కాయధాన్యాలు, వేరుశెనగలు, నువ్వులు, గోధుమలు, గింజలు వంటివి ఎక్కువగా తినకూడదు.

Potato Lollipop : బంగాళాదుంప లాలీపప్.. ఇలా ఈజీగా చేసుకోండి..

బ్లడ్ గ్రూప్ ” AB ”

ఈ బ్లడ్ గ్రూప్ వారు మాంసం, డెయిరీ ఉత్పత్తులు, బీన్స్, చిక్కుళ్లు, ధాన్యాలు, కూరగాయలు, టోఫు, సీఫుడ్, పైనాపిల్ వంటివి తినవచ్చు. రెడ్ మీట్, కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, విత్తనాలు, మొక్కజొన్న వంటివి ఎక్కువగా తినకూడదు. కాబట్టి మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎటువంటి ఆహారం తినాలో తినకూడదో డైటీషియన్ ని అడిగి కూడా ఫాలో అయి మరింత ఆరోగ్యంగా ఉండండి.